By: Arun Kumar Veera | Updated at : 27 Jan 2024 01:15 PM (IST)
మంచి హెల్త్ ఇన్సూరెన్స్‌ను 'ఫ్రీ'గా పొందొచ్చు
Health Insurance Premium Discounts: ఒక వ్యక్తి కాస్త పెద్ద జబ్బుతో ఆసుపత్రిలో జాయిన్ అయితే, ఆ కుటుంబం ఆర్థికంగా ఎంత కుంగిపోతుందో మనందరికీ తెలుసు. అలాంటి కఠిన పరిస్థితి నుంచి, ఒక మంచి ఆరోగ్య బీమా పథకం రక్షణ కల్పిస్తుంది.
మన దేశంలో, జీవిత బీమాకు (Life Insurance) లభించినంత ఆదరణ హెల్త్ ఇన్సూరెన్స్‌కు లభించడం లేదు. "నేను ఆరోగ్యంగానే ఉన్నా, నాకిప్పుడు పాలసీ అవసరం లేదు, ప్రీమియం రేట్లు ఎక్కువగా ఉన్నాయి" వంటి కారణాలతో మెజారిటీ ప్రజలు ఆరోగ్య బీమా పాలసీలకు దూరంగా ఉంటున్నారు. ప్రీమియం ధరలు తగ్గితే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి చాలా ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారు.
దీనిని గమనించిన ఆరోగ్య బీమా సంస్థలు (Health Insurance Companies), ఆరోగ్య బీమా ప్రీమియంలో 100% వరకు రాయితీ (Health Insurance Premium Discount) ఇవ్వడానికి కూడా ముందుకొస్తున్నాయి. తద్వారా, హెల్త్ పాలసీని చాలా చవగ్గా అమ్ముతున్నాయి.
ఆరోగ్య బీమాలో వెల్‌నెస్ డిస్కౌంట్ (Wellness Discount in Health Insurance)
ఆరోగ్య బీమాలో డిస్కౌంట్ పొందాలా, వద్దా అన్నది పాలసీహోల్డర్ చేతిలోనే ఉంది. కస్టమర్ కాస్త కష్టపడితే చాలు.. 100% వరకు డిస్కౌంట్ తీసుకోవచ్చు. అంటే, దాదాపు ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ జాక్‌పాట్ కొట్టొచ్చు. పైగా, కస్టమర్ పడే కష్టం కూడా అతనికి ఆరోగ్యపరంగా గణనీయంగా ఉపయోగపడుతుంది. అంటే, 'విన్-విన్ సిట్యుయేషన్'లో రెండు వైపులా లాభపడేది పాలసీహోల్డరే.
వెల్‌నెస్ డిస్కౌంట్ పొందడం ఎలా? (How to get wellness discount?)
ఆరోగ్య బీమాలో వెల్‌నెస్ డిస్కౌంట్ పొందడం చాలా ఈజీ. నడిస్తే చాలు, మీకు ప్రీమియంలో రాయితీ లభిస్తుంది.
ఉదాహరణకు... 'ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్రీమియం ప్లాన్' (Aditya Birla Activ Health Platinum Plan) గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లాన్ తీసుకున్నాక... ప్రతి రోజూ నడవడం (Health Insurance Discount with Walking) వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో 30% వరకు డిస్కౌంట్ ఇస్తోంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ. అమ్మో.. ప్రతిరోజూ నడవాలా? మా వల్ల కాదు, ప్రతిరోజూ వాకింగ్‌కు వీలు కాదు.. ఇలాంటి కారణాలు మీకు ఉన్నాయా?. పర్లేదు, ప్రతి రోజూ నడవాల్సిన అవసరం లేదు. ఒక నెలలో 13 రోజులు నడవండి (13 or more Active Days completed in a month) చాలు. అది కూడా రోజుకు 10 వేల అడుగు పూర్తి చేయండి. మీకు 30% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతోపాటు, రోజుకు 10 వేల అడుగులు చొప్పున, ఒక సంవత్సరంలో 275 రోజులు నడిస్తే (275 Active Days completed in a year) అదనంగా మరో 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ లెక్క ప్రకారం... ప్రతి నెలా సగటున 23 రోజులు నడిస్తే చాలు, 20% అడిషనల్ డిస్కౌంట్ పొందొచ్చు. మాములుగా నెలలో 13 రోజులు నడవాలి, దీనికి మరో 10 రోజుల్ని అదనంగా యాడ్ చేస్తే ఎక్‌స్ట్రా డిస్కౌంట్‌కు అర్హత లభిస్తుంది.
ఒక ఏడాదిలో, రోజుకు 10 వేల అడుగుల చొప్పున 325 రోజులు నడిస్తే.. (325 Active Days completed in a year) మరో 50% డిస్కౌంట్‌కు అర్హత వస్తుంది. ఏడాదిలో 325 రోజులు వాకింగ్ చేస్తే, పైన చెప్పిన 30%+20%+50% కలిపి మీకు 100% రాయితీ లభిస్తుంది. అంటే... మీరు పూర్తి ఉచితంగా 'ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్ ప్రీమియం ప్లాన్'ను పొందొచ్చు.
నడవాలి అనగానే నీరసంతో నీరుగారి పోవద్దు. చాలా మందికి నడక ఒక వ్యసనం లాంటిది. చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్నంగా గమనిస్తూ, సంగీతం వింటూ, పక్కవారితో పిచ్చాపాటీ మాట్లాడుతూ నడకను చాలా ఎంజాయ్ చేస్తారు. తొలి అడుగే ఇబ్బందిగా అనిపిస్తుంది. నడవడం మొదలు పెట్టాక.. శారీరకంగా, మానసికంగా మీరు ఎంత ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారో మీకే అర్ధం అవుతుంది. ఆ తర్వాత మీరు 'అన్‌స్టాపబుల్'గా మారిపోతారు, బ్రహ్మదేవుడు వచ్చి ఆగమన్నా ఆగరు.
నడక మాత్రమే కాదు, ఇవి కూడా ఉన్నాయి:
నడిచేంత మంచి పరిసరాలు లేదా పరిస్థితులు మీకు లేకపోతే... జిమ్‌కు వెళ్లొచ్చు లేదా యోగా క్లాస్‌లో చేరొచ్చు. ప్రతిరోజూ 30 నిమిషాల జిమ్ లేదా యోగా సెషన్ కంప్లీట్ చేస్తే ఒక 'యాక్టివ్ డే'గా గుర్తిస్తారు. ఒక ఎక్స్‌ర్‌సైజ్ సెషన్‌లో (one exercise session) రోజుకు 300 కేలరీలు కరిగించినా చాలు, అది ఒక 'యాక్టివ్ డే' కిందకు వస్తుంది. వీటితోపాటు, గుర్తింపు పొందిన మారథాన్‌లు, వాక్‌థాన్‌లు, సైక్లోథాన్‌లలో పాల్గొనడం ద్వారా కూడా ఆరోగ్య బీమా ప్రీమియంలో రాయితీ పొందొచ్చు.
మనం ఒళ్లు ఒంచితే బీమా కంపెనీకి ఏంటి లాభం?
నడక, ఎక్స్‌ర్‌సైజ్, యోగా వంటి వాటి వల్ల బాడీలో కేలరీలు బర్న్ అవుతాయి. మనుషులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతారని శాస్త్రీయంగా రుజువైంది. దానివల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఫైనల్‌గా.. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులు తగ్గుతాయి. అందుకే, ఆరోగ్య బీమా సంస్థలు వెల్‌నెస్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి.
ఒక్క ఆదిత్య బిర్లా మాత్రమే కాదు, చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వెల్‌నెస్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. పాలసీబజార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటి గురించి తెలుసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Diwali Stock Picks: ధనలక్ష్మికి ఆహ్వానం పలికే షేర్లు ఇవి - దీపావళి కల్లా కాసుల వర్షం ఖాయమట!
Dhanteras 2024: మీరు కొనేది అసలు బంగారమో, కాకి బంగారమో మీరే కనిపెట్టొచ్చు
Dhanteras 2024: ధన్‌తేరస్ గోల్డ్ షాపింగ్‌లో ఈ ఒక్కటీ చూడకపోతే మీ పని సున్నా!
Gold-Silver Prices Today 29 Oct: ధన్‌తేరస్ ఫీవర్‌తో ధనాధన్ పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Diwali 2024: దీపావళి స్పెషల్ స్టాక్స్ - అనతి కాలంలో అధిక లాభాలు మీ సొంతం!
Telangana Congress: బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
Kiran Abbavaram: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్