By: ABP Desam | Updated at : 09 Oct 2023 11:34 AM (IST)
ముడి చమురు రేట్లు ఒకేసారి 5% జంప్
Israel - Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో రష్యా-ఉక్రెయిన్ వార్ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది, ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది. ఈ టెన్షన్ ముడి చమురు ధరలకు మంట పెట్టింది.
పశ్చిమాసియా ప్రాంతం మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యం. ప్రపంచ ముడి చమురు అవసరాల్లో మూడింట ఒక వంతు ఈ ప్రాంతం నుంచే సప్లై అవుతుంది. శనివారం ఉదయం, ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్ దాడుల తర్వాత, పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ అస్థిరంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా హమాస్ సాయుధ దళాలు విరుచుకుపడ్డాయి. గత 50 ఏళ్లలో ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే అత్యంత భయంకరమైన దాడిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రెండు వైపులా వెయ్యికి మందికిపైగా చనిపోయారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. హమాస్, 100 మందికి పైగా ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుంది. సరిహద్దు పట్టణాల్లోని వీధుల్లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ అధికారికంగా యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచం మొత్తం రెండు జట్లుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం, యుద్ధం త్వరగా ముగిసే సూచనలు కనిపించడం లేదు.
ఒక్కసారే 5% పెరిగిన క్రూడాయిల్ రేట్లు
బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం, పశ్చిమ ఆసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ముడి చమురు ధరలు ఒక్కసారే 5 శాతం వరకు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బ్యారెల్‌కు 5.11 శాతం పెరిగి 87.02 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ 4.99 శాతం పెరిగి బ్యారెల్‌కు 88.76 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 3.20 డాలర్లు (3.28%) పెరిగి 87.78 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ 3.40 డాలర్లు (3.58%) పెరిగి 86.19 డాలర్ల వద్ద ఉంది.
వారం క్రితం భారీ పతనం
రష్యా, సౌదీ అరేబియా నుంచి ఉత్పత్తి కోతలతో ఇటీవల ముడి చమురు ధరలు మండిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షలను రష్యా సడలించడంతో, క్రూడాయిల్ రేట్లు గత వారంలో కూల్ అయ్యాయి. గత వారంలో, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 11 శాతం తగ్గింది, WTI ఫూచర్స్ దాదాపు 8 శాతం క్షీణించింది. ఈ ఏడాది మార్చి తర్వాత, ఒక్క వారంలో ముడిచమురు రేట్లు ఇంతలా తగ్గడం ఇదే అతి తొలిసారి. ఇప్పుడు, ఇజ్రాయెల్-హమాస్ పెడుతున్న టెన్షన్‌తో క్రూడ్ ఆయిల్‌లో అప్‌ట్రెండ్ మళ్లీ మొదలైంది.
క్రూడాయిల్ రేట్లు పెరగడానికి కీలక కారణం
నిజానికి, ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి ఇరాన్‌తో ముడిపడి ఉంది. ఈ దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రత్యక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. తమకు ఇరాన్ తోడ్పాటు అందించిందని హమాస్ గ్రూప్ కూడా అధికారికంగా ప్రకటించింది. యుద్ధాన్ని ఇరాన్ ప్రేరేపిస్తోందని ఇజ్రాయెల్ కూడా ఆరోపించింది. ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఇరాన్‌లో భారీగా సంబరాలు జరిగాయి. ఇరాన్, హమాస్‌ను ప్రశంసించింది కూడా. ముడి చమురును ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇరాన్ నుంచి క్రూడ్ సప్లై మళ్లీ నిలిచిపోతుందని మార్కెట్ భయపడుతోంది. ఆ భయమే ముడి చమురు ధరల్లో మంట పెట్టింది.
మరో ఆసక్తికర కథనం: ఇజ్రాయెల్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీపై ప్రభావం ఎంత, స్టాక్ మార్కెట్లు పడతాయా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్