search
×

Black Ink On Cheque: నల్ల ఇంకుతో రాసిన బ్యాంక్‌ చెక్‌ చెల్లదు! - ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే..?

Bank Cheque In Black Ink: బ్యాంక్‌ చెక్‌లను నల్ల సిరాతో రాస్తే అవి చెల్లుబాటు కావని ఆర్‌బీఐ కొత్త నిబంధన తీసుకువచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్‌గా మారింది.

FOLLOW US: 
Share:

Ban of black ink on cheque: ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‍‌(Reserve Bank of India) చెక్కులపై నల్ల ఇంక్ వాడకాన్ని నిషేధించినట్లు ఆ వార్తలో ఉంది. ఆర్‌బీఐ కొత్త ఆర్డర్‌ అంటూ ఒక ఆర్డర్‌ కాపీ కూడా ఆ వార్తతో పాటు సర్క్యులేట్‌ అవుతోంది. దీనిపై, ప్రభుత్వానికి చెందిన 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' (PIB) ఒక వివరణ ఇచ్చింది.

వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఇంకా ఏం ఉంది?
రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కొత్త నిబంధన ప్రకారం, ప్రజలు ఇకపై బ్యాంక్‌ చెక్కు రాయడానికి నీలం రంగు సిరా (Blue color ink) లేదా ఆకుపచ్చ రంగు సిరా ‍‌(Green color ink)ను మాత్రమే ఉపయోగించాలని వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఉంది. చెక్‌ రాసే సమయంలో ఖాతాదారులు అస్పష్టమైన చేతిరాతను నివారించాలని కూడా ఆర్‌బీఐ కొత్త ఆర్డర్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఉంది.

రంగంలోకి దిగిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ కావడం, దానిపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేయడంతో PIB రంగంలోకి దిగి వాస్తవ తనిఖీ (Fact check) చేపట్టింది. “చెక్కులపై నల్ల రంగు సిరా వాడకాన్ని నిషేధిస్తూ RBI కొత్త నిబంధన జారీ చేసిందని సోషల్ మీడియాలో క్లెయిమ్ చేస్తున్నారు. అది అబద్ధపు వార్త. చెక్కులను రాయడానికి ఉపయోగించాల్సిన నిర్దిష్ట రంగు సిరాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించలేదు" అని ఒక వివరణను Xలో పోస్ట్‌ చేసింది.

బ్యాంక్‌ చెక్‌ రాయడానికి RBI నియమాలు
CTS (చెక్ ట్రంకేషన్ సిస్టమ్)లో, ప్రతి చెక్ నుంచి మూడు ఫోటోలు తీస్తారు - ముందు వైపు గ్రే స్కేల్, నలుపు-తెలుపు  & వెనుక వైపు నలుపు-తెలుపు. వీటి ఆధారంగా, చెక్కుపై రాసి ఉన్న సమాచారం చూసేందుకు ఎలాంటి ఇబ్బంది కలగని రంగులు ఉపయోగించాలని బ్యాంక్‌ అధికారులు వినియోగదారులకు సూచిస్తున్నారు. దీంతో పాటు, ఎలాంటి మోసం జరగకుండా ఉండేందుకు, చెక్కు రాయడానికి వినియోగదారులు ఒక సిరాను మాత్రమే ఉపయోగించాలని కూడా చెబుతున్నారు. అయితే చెక్కులు రాయడానికి నిర్దిష్టమైన రంగును ఉపయోగించాలని రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ చెప్పలేదు. 

బ్యాంక్‌ చెక్‌లో దిద్దుబాట్లు ఉంటే?
చెక్ ట్రంకేషన్ సిస్టమ్ కింద, మార్పులు లేదా సవరణలతో కూడిన చెక్‌లను బ్యాంక్‌లు ఆమోదించబవు. కాబట్టి, చెక్‌ రాసేటప్పుడే ఎలాంటి మార్పులు లేదా దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే తేదీని మార్చవచ్చు. దీనికి మించి ఏ దిద్దుబాట్లను బ్యాంక్‌లు ఆమోదించవు.

మరో ఆసక్తికర కథనం: పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రాబోతున్నాయ్‌ - లిస్ట్‌లో మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్‌ చేయండి! 

Published at : 22 Jan 2025 10:15 AM (IST) Tags: Fact Check Black Ink RBI RESERVE BANK OF INDIA Bank cheque

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 04 April: ఏకంగా రూ.17,400 తగ్గిన పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 04 April: ఏకంగా రూ.17,400 తగ్గిన పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Car Safety Tips In Summer: మీ కార్‌ను కన్నకొడుకులా చూసుకోండి, ఈ తప్పులు చేస్తే మిగిలేది బూడిద!

Car Safety Tips In Summer: మీ కార్‌ను కన్నకొడుకులా చూసుకోండి, ఈ తప్పులు చేస్తే మిగిలేది బూడిద!

Gold-Silver Prices Today 03 April: హార్ట్ ఎటాక్‌ లాంటి షాక్‌ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 03 April: హార్ట్ ఎటాక్‌ లాంటి షాక్‌ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Property Loan: ఆస్తి తనఖా లోన్‌లపై లేటెస్ట్‌ వడ్డీ రేట్లు - రుణం తీసుకునే ముందు ఇది తెలుసుకోండి

Property Loan: ఆస్తి తనఖా లోన్‌లపై లేటెస్ట్‌ వడ్డీ రేట్లు - రుణం తీసుకునే ముందు ఇది తెలుసుకోండి

Gold-Silver Prices Today 02 April: పసిడి నగలను మరిచిపోవడం మంచిది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 02 April: పసిడి నగలను మరిచిపోవడం మంచిది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Telangana Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Telangana Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

AP Latest Weather: ఓవైపు ఉక్కపోత, మరోవైపు పిడుగుల మోత-ఏపీలో భిన్న వాతావరణం

AP Latest Weather: ఓవైపు ఉక్కపోత, మరోవైపు పిడుగుల మోత-ఏపీలో భిన్న వాతావరణం

Trump Tariffs Impact: మేక్ ఇన్ ఇండియాతో మ్యాజిక్ చేయొచ్చా! అమెరికా చర్యలతో భారత్‌కు అవకాశం వచ్చినట్టేనా!

Trump Tariffs Impact: మేక్ ఇన్ ఇండియాతో మ్యాజిక్ చేయొచ్చా! అమెరికా చర్యలతో  భారత్‌కు అవకాశం వచ్చినట్టేనా!

Alekhya Chitti Pickles: రేప్, మర్డర్ చేస్తారా? నాతో పాటు మా ఆయన్ను... ఏంటిది? అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీపై పెద్దక్క రియాక్షన్

Alekhya Chitti Pickles: రేప్, మర్డర్ చేస్తారా? నాతో పాటు మా ఆయన్ను... ఏంటిది? అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీపై పెద్దక్క రియాక్షన్