By: ABP Desam | Updated at : 09 Sep 2022 08:43 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే - 9 సెప్టెంబరు 2022
Stocks to watch today, 9 September 2022: ఇవాళ ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 86 పాయింట్లు లేదా 0.48 శాతం గ్రీన్‌లో 17,905 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ ప్రారంభం ఉంటుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
NBFCలు: నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ (BB రేటింగ్), ముత్తూట్ ఫైనాన్స్ (BB రేటింగ్), మణప్పురం ఫైనాన్స్ (BB- రేటింగ్), IIFL ఫైనాన్స్ (B+ రేటింగ్) మీద, ఫిచ్ తన రేటింగ్‌లను కొనసాగించింది. ఈ రేటింగ్స్‌ను బట్టి ఇవాళ మార్కెట్‌లో ఈ స్టాక్స్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL): రిలయన్స్ గ్రూప్‌లోని టెలికాం విభాగం జియో, 5G నెట్‌వర్క్‌ను అక్టోబర్‌లో ప్రారంభించేందు వేగంగా అడుగులు వేస్తోంది. మొదటి దశలో.. ముంబై, కోల్‌కతాలో సేవలు ప్రారంభించడానికి టెలికాం గేర్ మేకర్ ఎరిక్సన్‌తో ఒప్పందాన్ని ఖరారు చేసే ఫైనల్ స్టేజ్‌లో ఉంది. దిల్లీ సర్కిల్ కోసం నోకియాతో తుది చర్చలు జరుపుతోంది.
కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్): కొత్త పాలసీ మీద స్పష్టత లేకపోవడం వల్ల స్టాక్‌లో పెరుగుదలకు కళ్లెం పడే అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో స్టాక్‌కు సానుకూల ట్రిగ్గర్ ఉన్నప్పటికీ, గతి శక్తి టెర్మినల్స్ కోసం రైల్వే భూములను లీజుకు తీసుకోవడంపై స్పష్టత లేకపోవడంతో బ్రోకరేజీలు ఈ స్టాక్ మీద 'న్యూట్రల్', 'నెగెటివ్' వ్యూ తీసుకున్నాయి.
మహీంద్ర & మహీంద్ర (M&M): ఈ ఆటో మేజర్ గురువారం తన మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) 'XUV 400'ని ఆవిష్కరించింది. మార్కెట్‌లో విజయవంతమైన XUV 300 ఆధారంగా దీనిని తయారు చేసింది. టాటా మోటార్స్‌కు చెందిన Nexon EVతో మహీంద్ర XUV 400 పోటీ పడుతుంది.
వొడాఫోన్ ఐడియా (VIL): అధికారిక సమాచారం ప్రకారం, ఈ కంపెనీ స్టాక్ ధర రూ.10 లేదా అంత కంటే పైన స్థిరపడిన తర్వాత, వొడాఫోన్ ఐడియాలో వాటా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ విలువ వద్ద కొనుగోలు జరగాలన్న సెబీ నిబంధన కారణంగా రూ.10 పైన స్థిరపడే వరకు ప్రభుత్వం వేచి చూస్తుంది.
రిలయన్స్ పవర్: పెట్టుబడి సంస్థ వార్డే పార్ట్‌నర్స్‌కు అనుబంధంగా ఉన్న వీఎఫ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్‌కు (VFSI Holdings) ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా షేర్లను కేటాయించి రూ.933 కోట్లు సమీకరించనుంది. దీనివల్ల, రిలయన్స్ పవర్‌లో VFSIకు 15 శాతం వాటా దక్కుతుంది.
జెట్ ఎయిర్‌వేస్: పునరాగమనానికి సిద్ధమవుతున్న జెట్ ఎయిర్‌వేస్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఎయిర్‌లైన్స్‌లోని ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులు రాజీనామాలు చేశారు. రాజీనామా చేసినవాళ్ల ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కెప్టెన్ నీరజ్ చందన్ (ఫ్లైట్ సేఫ్టీ హెడ్), కెప్టెన్ విశేష్ ఒబెరాయ్ (ఆపరేషన్ హెడ్), కెప్టెన్ సొరబ్ వరియావా (శిక్షణాధిపతి). అయితే, విమానయాన సంస్థను రీలాంచ్ చేస్తున్న జలాన్ కల్రాక్ కన్సార్టియం (JKC) ఈ రాజీనామాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
IOL కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్: పెయిన్ కిల్లర్ డ్రగ్ ఇబుప్రోఫెన్‌కు సంబంధించిన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్‌లో (API), ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒక వంతు మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఈ బల్క్ డ్రగ్ కంపెనీ, వచ్చే నాలుగేళ్లలో తన ప్రొడక్ట్ బాస్కెట్‌ను డైవర్సిఫై చేసి, ఆదాయాన్ని రెండింతలు పైగా పెంచుకోవాలని చూస్తోంది.
ఇవాళ F&O నిషేధంలో ఉన్న స్టాక్స్: డెల్టా కార్ప్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్