By: ABP Desam | Updated at : 14 Sep 2023 03:57 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 14 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఒడుదొడుకులు ఎదురైనా రికార్డు గరిష్ఠాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్లు పెరిగి 20,103 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 52 పాయింట్లు పెరిగి 67,518 వద్ద క్లోజయ్యాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి సూచీలకు మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 83.04 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 67,466 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 67,627 వద్ద మొదలైంది. 67,336 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,771 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 52 పాయింట్ల లాభంతో 67,519 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 20,070 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 20,125 వద్ద ఓపెనైంది. 20,043 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,167 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 33 పాయింట్లు పెరిగి 20,103 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 46,013 వద్ద మొదలైంది. 45,801 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,153 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 91 పాయింట్ల లాభంతో 46,000 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో (3.30%), యూపీఎల్ (3.86%), ఎంఅండ్‌ఎం (2.41%), ఓఎన్‌జీసీ (2.15%), దివిస్ ల్యాబ్ (2.00%) షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్ (1.15%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (0.97%), కోల్ ఇండియా (0.86%), బ్రిటానియా (0.74%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (0.71%) నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.73,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.24,000 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. సూచీలు జీవిత కాల గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్లు తగ్గి 19,993 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 94 పాయింట్లు తగ్గి 67,221 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లు జోరుమీదున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy