By: ABP Desam | Updated at : 26 Sep 2023 04:01 PM (IST)
షేర్ మార్కెట్
Stock Market Closing 26 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 9 పాయింట్లు తగ్గి 19,664 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 78 పాయింట్లు తగ్గి 65,945 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,023 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,071 వద్ద మొదలైంది. 65,865 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,078 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 78 పాయింట్లు తగ్గి 65,945 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,674 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,682 వద్ద ఓపెనైంది. 19,637 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,699 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 9 పాయింట్లు నష్టపోయి 19,664 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,722 వద్ద మొదలైంది. 44,532 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 141 పాయింట్ల నష్టంతో 44,624 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. ఐచర్ మోటార్స్ (2.61%), హీరో మోటో కార్ప్ (2.13%), నెస్లే ఇండియా (1.51%), ఓఎన్జీసీ (1.32%), బజాజ్ ఆటో (1.30%) షేర్లు లాభపడ్డాయి. సిప్లా (1.37%), టెక్ మహీంద్రా (1.29%), ఇండస్ ఇండ్ బ్యాంకు (1.14%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (0.95%), ఏసియన్ పెయింట్స్ (0.94%) నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస సూచీలు కొంత పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.59,730 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.370 తగ్గి రూ.24,190 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆఖర్లో సెంటిమెంటు బలపడటంతో లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) అర పాయింటు పెరిగి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడి 83.15 వద్ద స్థిరపడింది. ఐటీ షేర్లు మాత్రం ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు