By: Rama Krishna Paladi | Updated at : 23 Jun 2023 10:55 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 23 June 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగెటివ్ సిగ్నల్స్ అందాయి. హాకిష్ ఫెడ్ కామెంట్స్‌లో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 47 పాయింట్లు తగ్గి 18,723 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 76 పాయింట్లు తగ్గి 63,162 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 63,238 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 63,124 వద్ద మొదలైంది. 62,874 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,180 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 76 పాయింట్ల నష్టంతో 63,162 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,771 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,741 వద్ద ఓపెనైంది. 18,647 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,756 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 47 పాయింట్ల నష్టంతో 18,723 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,641 వద్ద మొదలైంది. 43,519 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,794 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 44 పాయింట్లు పెరిగి 43,768 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఏసియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టపోయాయి. బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు సూచీలు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.59,020గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.71,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.680 తగ్గి రూ.24,220 వద్ద ఉంది.
Also Read: 'మాల్ ఆన్ వీల్స్' - జర్నీలో షాపింగ్, స్టేషన్‌లో దిగగానే డెలివెరీ
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Never take these things from a stranger, especially when it comes to stock market tips. Be smart about your investments.#InvestorProtect #BSE #SmartInvestor #InvestorEducation #ShareMarket pic.twitter.com/juIt7BLbmC
— BSE India (@BSEIndia) June 23, 2023
Trend of #Sensex #Derivatives on Thursdays #SensexDerivatives #BSE #BombayStockExchange #BSEIndia #OptionsTrading #ThunderThursdays pic.twitter.com/h9wjcd1yW7
— BSE India (@BSEIndia) June 22, 2023
Trend of #Sensex #Derivatives on Thursdays #SensexDerivatives #BSE #BombayStockExchange #BSEIndia #OptionsTrading #ThunderThursdays pic.twitter.com/h9wjcd1yW7
— BSE India (@BSEIndia) June 22, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్ ఆహ్వానించిన టీటీడీ