search
×

Stock Market News: యూఎస్‌ ఫెడ్‌ హాకిష్‌ కామెంట్స్‌ - ఎర్రబారిన నిఫ్టీ, సెన్సెక్స్‌!

Stock Market Opening 19 May 2023: స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో మొదలయ్యాయి. యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌పర్సన్‌ హాకిష్ కామెంట్స్‌ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది.

FOLLOW US: 
Share:

Stock Market Opening 19 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూఎస్‌ ఫెడ్‌ ఛైర్‌పర్సన్‌ హాకిష్ కామెంట్స్‌ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 32 పాయింట్లు తగ్గి 18,097 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 106 పాయింట్లు తగ్గి 61,325 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,431 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,556 వద్ద మొదలైంది. 61,273 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 106 పాయింట్ల నష్టంతో 61,325 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 18,129 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,186 వద్ద ఓపెనైంది. 18,066 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,186 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 32 పాయింట్లు తగ్గి 18,097 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,930 వద్ద మొదలైంది. 43,531 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,961 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 84 పాయింట్లు తగ్గి 43,668 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫీ, విప్రో, టీసీఎస్‌ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, హీరో మోటో కార్ప్‌, బ్రిటానియా, టాటా కన్జూమర్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా రియాల్టీ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60,870గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.27,980 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Also Read: పాత-కొత్త పన్ను పద్ధతుల్లో దేన్ని ఫాలో అవుతున్నారు, ఇప్పటికీ తేల్చుకోలేదా?

Published at : 19 May 2023 10:44 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో జజ్జనక! 18,700 పైన నిఫ్టీ, 63,142 వద్ద సెన్సెక్స్‌ క్లోజింగ్‌!

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో జజ్జనక! 18,700 పైన నిఫ్టీ, 63,142 వద్ద సెన్సెక్స్‌ క్లోజింగ్‌!

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

Stock Market News: టర్న్‌ అరౌండ్‌ అయిన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్‌!

Stock Market News: కొనసాగుతున్న కన్సాలిడేషన్‌ - స్వల్పంగా తగ్గిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market News: కొనసాగుతున్న కన్సాలిడేషన్‌ - స్వల్పంగా తగ్గిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market News: బుల్‌రన్‌ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!

Stock Market News: బుల్‌రన్‌ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

Stock Market News: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం