By: Rama Krishna Paladi | Updated at : 17 Jul 2023 11:05 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 17 July 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. రికార్డు గరిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్లు పెరిగి 19,614 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 154 పాయింట్లు పెరిగి 66,214 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 66,060 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,148 వద్ద మొదలైంది. 66,015 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 154 పాయింట్ల లాభంతో 66,214 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,564 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,612 వద్ద ఓపెనైంది. 19,562 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,641 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 49 పాయింట్లు పెరిగి 19,614 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,951 వద్ద మొదలైంది. 44,695 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,964 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 65 పాయింట్లు తగ్గి 44,753 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. హీరోమోటో కార్ప్, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేం లేవు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది. కిలో వెండి రూ.77,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.25,480 వద్ద ఉంది.
Also Read: రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ + రెగ్యులర్ ఇన్‌కమ్ - ఈ స్కీమ్స్ ట్రై చేయొచ్చు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Congratulations to LLOYDS METALS AND ENERGY LIMITED on getting listed on NSE today.#NSE #NSEIndia #listing #IPO #StockMarket #ShareMarket #LloydsMetalsandEnergy @ashishchauhan pic.twitter.com/T3YdI3Mflo
— NSE India (@NSEIndia) July 17, 2023
Can you identify the three Healthcare companies listed on NSE?#NSECrossword #Crossword #ShareMarket #StockMarket #InvestorEducation pic.twitter.com/OyFXJVULIl
— NSE India (@NSEIndia) July 16, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?