By: ABP Desam | Updated at : 16 Jul 2023 11:41 AM (IST)
రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ + రెగ్యులర్ ఇన్‌కమ్
Regular Income Schemes: మీ దగ్గర ఉన్న ఒక్క రూపాయిని ఇన్వెస్ట్ చేయాలన్నా మార్కెట్ల్‌లో బోలెడన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. పక్కింటి వాళ్ల దగ్గర్నుంచి ఆఫీస్‌లో కొలీగ్స్ వరకు చాలా పెట్టుబడి సలహాలు ఇస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు రిస్క్ ఉండకూడదు అన్న విషయాన్ని మైండ్‌లో పెట్టుకుని ఎవరి సలహాలైనా స్వీకరించవచ్చు.
షేర్ల నుంచి బంగారం వరకు, మ్యూచువల్ ఫండ్ల నుంచి రియల్ ఎస్టేట్ వరకు చాలా రకాల పెట్టుబడి మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిది షార్ట్‌కట్ రూట్. ఎక్కువ రిస్క్ తీసుకుంటే షార్ట్ టర్మ్‌లోనే డబ్బు సంపాదించొచ్చు. మరికొన్నింటిది స్ట్రెయిట్ రూట్. తక్కువ రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు అందుతాయి. ఇలాంటి ప్లాన్స్‌లో డబ్బులు మదుపు చేస్తే క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.
స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, రిటైర్‌మెంట్ స్కీమ్స్‌ను లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా చూడాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈక్విటీ ఫండ్స్‌లో కూడా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) మీకు రెగ్యులర్ ఆదాయాన్ని అందించే ఒక పెట్టుబడి పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకం (స్మాల్ సేవింగ్స్ స్కీమ్) కింద నడుస్తుంది. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 9 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. జాయింట్ ఖాతా ఓపెన్ చేస్తే రూ. 15 లక్షల వరకు జమ చేయవచ్చు. కనిష్టంగా రూ. 1000 పెట్టుబడి నుంచి ప్రారంభించవచ్చు.
ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లు లేదా గోల్డ్ బాండ్లు
నిధులను సేకరించేందుకు ప్రభుత్వం ఇటువంటి బాండ్లను జారీ చేస్తుంది. దీని కింద కొంత కాలం పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ పెట్టుబడిపై వడ్డీని కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. హామీతో కూడిన రాబడిని ఇది ఇస్తుంది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది మంచి ఎంపిక. ఫిక్స్‌డ్ రేట్ బాండ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB), ఇన్‌ఫ్లేషన్-ఇండెక్స్డ్ బాండ్‌లు, PSU బాండ్‌లు, జీరో-కూపన్ బాండ్‌లు మొదలైన వాటిలో మీ డబ్బును జమ చేయవచ్చు.
మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్
మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ (MIP) అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి. డెట్ & ఈక్విటీ సెక్యూరిటీల నుంచి ఆదాయాన్ని పొందడం, మూలధనాన్ని సంరక్షించడం వంటి లక్ష్యాలతో ఈ పెట్టుబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని సంపాదించడానికి సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్‌ను (Systematic withdrawal plan -SWP) ఉపయోగించడం ఉత్తమ మార్గం.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి
మీ పెట్టుబడిపై మంచి ఆదాయం సంపాదించడానికి రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతంలో మీ పెట్టుబడిని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, ఆకర్షణీయమైన మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవి కాకుండా... కేంద్ర ప్రభుత్వం అందించే PPF, రిటైర్మెంట్ ఫండ్ EPF, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి పథకాలలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
మరో ఆసక్తికర కథనం: సేల్స్‌లో సుజుకి యాక్సెస్ 125 కొత్త మైలురాయి - ఏకంగా 50 లక్షల యూనిట్లు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Tax Exemption: ఈ స్కీమ్‌కు కొత్త విధానంలోనూ పన్ను మినహాయింపు, బోలెడు డబ్బు ఆదా!
RBI MPC Key Polints: రెపో రేట్ నుంచి ద్రవ్యోల్బణం వరకు - ఆర్‌బీఐ గవర్నర్ ప్రసంగంలోని కీలకాంశాలు
Repo Rate Cut: బ్రేకింగ్ న్యూస్ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Reduction In Repo Rate: బ్యాంక్ లోన్ తీసుకువేవాళ్లకు భారీ శుభవార్త - రెపో రేటులో కోత, మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే?
Gold-Silver Prices Today 09 April: ఒకేసారి రూ.7000 పెరిగిన పసిడి, పతనమైన సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Amaravati Hyderabad Greenfield Expressway: అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్రం ఆమోదం
Kannappa New Release Date: 'కన్నప్ప' కొత్త రిలీజ్ డేట్ వచ్చింది... జూన్ నెలాఖరున థియేటర్లలోకి విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్
Love Story: కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చి అత్తతో లవ్ జంపింగ్ - ప్రేమ గుడ్డిదన్న మాట నిజం చేశారుగా !
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy