search
×

Stock Market News: మార్కెట్లో వొలటిలిటీ.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ - దివిస్‌, అదానీ టాప్‌ గెయినర్స్‌!

Stock Market Opening 15 June 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లోనే మొదలయ్యాయి. ఫెడ్‌ రేట్ల పెంపుకు విరామం ఇవ్వొచ్చని వార్తలు రావడంతో మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంటు పెరిగింది.

FOLLOW US: 
Share:

Stock Market Opening 15 June 2023: 

స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లోనే మొదలయ్యాయి. ఫెడ్‌ రేట్ల పెంపుకు విరామం ఇవ్వొచ్చని వార్తలు రావడంతో మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంటు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్లు పెరిగి 18,781 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 49 పాయింట్లు పెరిగి 63,265 వద్ద కొనసాగుతున్నాయి. దివిస్ ల్యాబ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ టాప్‌ గెయినర్స్‌.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 63,228 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,153 వద్ద మొదలైంది. 63,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 49 పాయింట్ల లాభంతో 63,265 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 18,755 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,774 వద్ద ఓపెనైంది. 18,721 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,794 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 25 పాయింట్లు ఎగిసి 18,781 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 44,054 వద్ద మొదలైంది. 43,839 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,077 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 59 పాయింట్లు తగ్గి 43,928 వద్ద నడుస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో హాస్పిటల్స్‌, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫీ, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్సీ లైఫ్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఐటీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.59,670గా ఉంది. కిలో వెండి రూ.900 తగ్గి రూ.73,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.25,610 వద్ద ఉంది. 

Also Read: జొమాటో 'డెలివెరీ బాయ్' సంపాదన రోజుకు కోటి రూపాయలు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 15 Jun 2023 11:03 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

టాప్ స్టోరీస్

Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్

Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్

Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!

Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!

Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?

Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?

AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్

AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్