By: ABP Desam | Updated at : 13 Jan 2023 11:31 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 13 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఆర్థిక మందగమనం భయాలు వెంటాడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 26 పాయింట్ల నష్టంతో 17,831 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 143 పాయింట్ల నష్టంతో 59,823 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 59,958 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,044 వద్ద మొదలైంది. 59,628 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,044 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 143 పాయింట్ల నష్టంతో 59,823 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,858 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,867 వద్ద ఓపెనైంది. 17,774 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,872 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 26 పాయింట్ల నష్టంతో 17,831 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మోస్తరు నష్టాల్లో ఉంది. ఉదయం 42,171 వద్ద మొదలైంది. 41,885 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,202 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 80 పాయింట్లు తగ్గి 42,001 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, ఇన్ఫీ, హెచ్‌డీఎఫ్సీ లైఫ్, దివిస్ ల్యాబ్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీ, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?