By: ABP Desam | Updated at : 07 Dec 2022 10:21 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 07 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందలేదు. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు సమీక్ష ఉండటంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 6 పాయింట్ల లాభంతో 18,649 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 107 పాయింట్ల లాభంతో 62,708 వద్ద ట్రేడవుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్ల జోరు కొనసాగుతోంది.
BSE Sensex
క్రితం సెషన్లో 62,626 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,615 వద్ద మొదలైంది. 62,524 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,735 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 107 పాయింట్ల లాభంతో 62,708 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 18,642 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,638 వద్ద ఓపెనైంది. 18,608 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,655 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 6 పాయింట్ల లాభంతో 18,649 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ మోస్తరు లాభాల్లో ఉంది. ఉదయం 43,157 వద్ద మొదలైంది. 43,140 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,327 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 151 పాయింట్లు ఎగిసి 43,290 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, ఎల్‌టీ, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యునీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, విప్రో నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
WhatsApp Fine: వాట్సాప్‌కు రూ.211 కోట్ల ఫైన్ - 2021లో చేసిన తప్పుకు ఇప్పుడు జరిమానా!
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి