By: ABP Desam | Updated at : 24 May 2023 04:10 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్‌డేట్ ( Image Source : Getty )
Stock Market Closing 24 May 2023:
మూడు రోజుల లాభాలకు తెరపడింది. స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఉదయం మోస్తరు ఎగిసిన సూచీలు సాయంత్రానికి రెడ్‌జోన్లోకి వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 62 పాయింట్లు తగ్గి 18,285 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 208 పాయింట్లు తగ్గి 61,773 వద్ద క్లోజ్ అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.68 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,981 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,832 వద్ద మొదలైంది. 61,708 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 208 పాయింట్ల నష్టంతో 61,773 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,348 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,294 వద్ద ఓపెనైంది. 18,262 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,392 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 62 పాయింట్లు తగ్గి 18,285 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,751 వద్ద మొదలైంది. 43,639 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,010 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 276 పాయింట్లు తగ్గి 43,677 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఇండస్‌ఇండ్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, ప్రైవేటు బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.260 పెరిగి రూ.61,360గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.75,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.27,960 వద్ద కొనసాగుతోంది.
Also Read: ₹2 వేల నోట్లను వచ్చే నెలలో మార్చుకోవాలని ప్లాన్ చేశారా?, ఆ నెలలో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In this segment of #LetsTalkFinance, let's understand what Blue Chip Stock is!#InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #StockMarketIndia #StockMarket #Investor #Investment #BlueChipStocks pic.twitter.com/UdG1ZfUnBE
— NSE India (@NSEIndia) May 24, 2023
Attention Investors! Always make sure that your stockbroker settles the funds within 1 working day of settlement.
— NSE India (@NSEIndia) May 23, 2023
#NSEIndia #SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #InvestorProtection #brokersarenotbankers @ashishchauhan pic.twitter.com/jMgxsrkYX5
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్ ఆహ్వానించిన టీటీడీ