By: ABP Desam | Updated at : 21 Feb 2023 03:56 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 21 February 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు ఎగిశాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మదుపర్లు బ్యాంకు షేర్లను అమ్మేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17 పాయింట్లు తగ్గి 17,826 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 18 పాయింట్ల తగ్గి 60,672 వద్ద ముగిశాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలహీనపడి రూ.82.79 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,691 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,770 వద్ద మొదలైంది. 60,583 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,976 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 18 పాయింట్ల నష్టంతో 60,672 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,844 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,905 వద్ద ఓపెనైంది. 17,800 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,924 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 17 పాయింట్లు తగ్గి 17,826 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 40,784 వద్ద మొదలైంది. 40,508 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,946 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 28 పాయింట్లు తగ్గి 40,673 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టపోయాయి. ఎన్‌టీపీసీ, బ్రిటానియా, టాటా స్టీల్, రిలయన్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 100 తగ్గి రూ.56,730గా ఉంది. కిలో వెండి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.24,610 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to Lead Reclaim and Rubber Products Limited on getting listed on NSE Emerge today. Public Issue was of Rs. ₹487.50 lakhs at an issue price of Rs. 25 per share.#listing #NSE #BellRinging #ShareMarket #StockMarket #LeadReclaim #IPO #RingTheBell @ashishchauhan pic.twitter.com/GNJm4WPDfq
— NSE India (@NSEIndia) February 21, 2023
It's the 300th SME listing on NSE Emerge today!
— NSE India (@NSEIndia) February 21, 2023
NSE Emerge is a platform for SMEs to raise capital. It also provides investors with opportunities to invest in emerging businesses with exciting growth plans and innovative business models.#NSEEmerge #SME #Listing @ashishchauhan pic.twitter.com/CO0iXgmiPh
Congratulations to Indore Municipal Corporation on listing of Green Bond on NSE today at Bhopal. #NSE #listing #BellRinging #ShareMarket #StockMarket #GreenBond #Bhopal @ChouhanShivraj @OfficeofSSC @Mpurbandeptt @CMMadhyaPradesh @ashishchauhan pic.twitter.com/HlO6NFR8qy
— NSE India (@NSEIndia) February 21, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత