By: ABP Desam | Updated at : 20 Jan 2023 03:58 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 20 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం ఊగిసలాటకు గురైన సూచీలు కాసేపు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐరోపా మార్కెట్లు తెరిచాక నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 80 పాయింట్ల నష్టంతో 18,027 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 236 పాయింట్ల నష్టంతో 60,621 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు బలపడి 81.12 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,858 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,901 వద్ద మొదలైంది. 60,585 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,001 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 236 పాయింట్ల నష్టంతో 60,621 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 18,107 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,115 వద్ద ఓపెనైంది. 18,016 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,145 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 80 పాయింట్ల నష్టంతో 18,027 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 42,516 వద్ద మొదలైంది. 42,366 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,709 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 177 పాయింట్లు పెరిగి 42,506 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు సూచీలు స్వల్పంగా ఎగిశాయి. ఆటో, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!