By: ABP Desam | Updated at : 18 Jan 2023 04:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 18 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 112 పాయింట్ల లాభంతో 18,165 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 52 పైసలు బలపడి 81.24 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,655 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,716 వద్ద మొదలైంది. 60,569 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 390 పాయింట్ల లాభంతో 61,045 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 18,053 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,074 వద్ద ఓపెనైంది. 18,032 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,183 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 112 పాయింట్ల లాభంతో 18,165 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,271 వద్ద మొదలైంది. 42,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,555 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 229 పాయింట్లు పెరిగి 42,458 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, ఎల్‌టీ, యూపీఎల్, విప్రో షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్ సెమ్, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఒక శాతానికి పైగా పతనమైంది. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?