By: ABP Desam | Updated at : 17 Jan 2023 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 17 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 158 పాయింట్ల లాభంతో 18,053 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 562 పాయింట్ల లాభంతో 60,655 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్ల మేర సంపద ఆర్జించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీన పడి 81.77 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,092 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,142 వద్ద మొదలైంది. 60,072 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,704 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 562 పాయింట్ల లాభంతో 60,655 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,894 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,922 వద్ద ఓపెనైంది. 17,886 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,072 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 158 పాయింట్ల లాభంతో 18,053 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,241 వద్ద మొదలైంది. 41,861 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,383 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 67 పాయింట్లు పెరిగి 42,235 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌టీ, హిందుస్థాన్ యునీలివర్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market News: తారాజువ్వలా ఎగిసి.. చప్పున పడిపోయిన స్టాక్ మార్కెట్లు! ఎందుకిలా?
Stock Market Live updates: ఆకాశం వైపు స్టాక్ మార్కెట్ల పరుగులు - ట్రెండింగ్ స్టాక్స్ ఇవే!
Stock Market News: రాకెట్లా ఎగిసిన స్టాక్ మార్కెట్లు - జోష్‌లో మదుపర్లు!
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!
Stock Market News: దూసుకెళ్తున్న అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు - నష్టాల్లోనే నిఫ్టీ, సెన్సెక్స్!
YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ