By: ABP Desam | Updated at : 04 Nov 2022 04:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 04 November 2022: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగిచిన సూచీలు ఆఖర్లో ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 64 పాయింట్ల లాభంతో 18,117 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 113 పాయింట్ల లాభంతో 60,950 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 45 పైసలు లాభపడి 82.43 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,836 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,698 వద్ద మొదలైంది. 60,666 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,004 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 113 పాయింట్ల లాభంతో 60,950 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 18,052 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,053 వద్ద ఓపెనైంది. 18,017 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,135 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 64 పాయింట్ల లాభంతో 18,117 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 41,314 వద్ద మొదలైంది. 41,051 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,516 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 39 పాయింట్ల నష్టంతో 41,258 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్‌షేర్లు లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హిందుస్థాన్ యునీలివర్, దివిస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun: గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు