By: ABP Desam | Updated at : 24 Jan 2023 12:23 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixabay )
Stock Market @12 PM, 24 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. కొనుగోళ్ల విషయంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 3 పాయింట్ల లాభంతో 18,122 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 60 పాయింట్ల లాభంతో 61,001 వద్ద కొనసాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. మరోవైపు ఐటీ షేర్లకు గిరాకీ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,941 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,122 వద్ద మొదలైంది. 60,974 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,266 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 60 పాయింట్ల లాభంతో 61,001 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 18,188 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,183 వద్ద ఓపెనైంది. 18,116 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,201 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 3 పాయింట్ల లాభంతో 18,122 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 42,994 వద్ద మొదలైంది. 42,725 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,078 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 75 పాయింట్లు తగ్గి 42,746 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Also Read: సొంతింటి కల ఈ బడ్జెట్‌లో నెరవేరే ఛాన్స్, ఈసారి అంచనాలు ఇవి
Also Read: ఫిబ్రవరిలో బ్యాంకులకు 10 రోజులు సెలవులు, హాలిడేస్ లిస్ట్ ఇదిగో
Also Read: టెక్ కంపెనీలు ఎందుకు ఉద్యోగాలు తీసేస్తున్నాయి, భారత్‌పై ఎలాంటి ప్రభావం పడింది?
Congratulations to Kamdhenu Ventures Limited on getting #listed on #NSE today. #Listing #NSEIndia #StockMarket #ShareMarket #KamdhenuVenturesLimited @AshishChauhan pic.twitter.com/fuIzj27GBg
— NSE India (@NSEIndia) January 24, 2023
NSE Academy signs MoU with Commissionerate of Collegiate Education, Government of Andhra Pradesh for skill development courses for students.
— NSE Academy (@nse_academy) January 24, 2023
To know more visit https://t.co/bsbRY6I7w4
#PressRelease #NSEIndia #nseacademy @NSEIndia pic.twitter.com/ESII4RQ5sl
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం