search
×

SBI Shares: ₹5 లక్షల కోట్ల క్లబ్‌లో SBI, మూడు నెలల్లోనే 26% జూమ్‌

దేశంలో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన మూడో లెండర్‌గా SBI నిలిచింది.

FOLLOW US: 

SBI Shares: దేశంలో అతి పెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), ఇవాళ్టి (బుధవారం) ట్రేడ్‌లో రెండు రికార్డ్‌లు క్రియేట్‌ చేసింది. ఇంట్రా డే ట్రేడ్‌లో ఈ బ్యాంక్‌ షేర్లు దాదాపు 3 శాతం పెరిగి రూ.574.85 దగ్గర కొత్త 52 వారాల శిఖరానికి చేరాయి. దీంతో, బ్యాంక్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) మొదటిసారిగా రూ.5 ట్రిలియన్ల (రూ.5 లక్షల కోట్లు) మార్కును తాకింది. ఇవాళ్టి గ్యాప్‌ డౌన్‌‌ బలహీనమైన మార్కెట్‌లోనూ ఈ స్క్రిప్‌లో జోరు కనిపించింది.

రూ.5.11 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, BSE మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో SBI ఏడో స్థానంలో నిలిచింది. ఇది గరిష్ట స్థాయికి చేరిన సమయంలో బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్ నిన్నటి క్లోజింగ్‌ మార్కును అందుకోవడానికి ఆపసోపాలు పడుతోంది.

థర్డ్‌ లెండర్‌
దేశంలో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన మూడో లెండర్‌గా SBI నిలిచింది. భారతంలో అతి పెద్ద ప్రైవేట్ లెండర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ఈ జాబితాలో మొదటి ర్యాంక్‌ను మెడలో వేసుకుని తిరుగుతోంది. దీని మార్కెట్ విలువ రూ.8.38 ట్రిలియన్లు. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) రూ.6.33 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది.

గత మూడు నెలల్లో, సెన్సెక్స్‌లోని 13.9 శాతం పెరుగుదలతో పోలిస్తే, SBI 26 శాతం పెరిగి, మార్కెట్‌ను ఔట్‌పెర్ఫార్మ్‌ చేసింది. ఇదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ 32 శాతం ర్యాలీ చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 శాతం లాభపడింది.

గత నెల రోజుల్లో దాదాపు 9 శాతం, గత ఆరు నెలల్లో 18 శాతం ఈ కౌంటర్‌ లాభపడింది.

దాదాపు రూ.54 ట్రిలియన్ కోట్ల (2022 మార్చి నాటికి) బ్యాలెన్స్ షీట్‌ సైజ్‌తో, దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ SBI. అన్ని ప్రభుత్వ రంగ (PSU) బ్యాంకుల కంటే ఎస్‌బీఐకి ఆరోగ్యకర రిటైల్ పోర్ట్‌ఫోలియో, ఉత్తమ ఆపరేటింగ్‌ మెట్రిక్స్‌ ఉన్నాయి. దీని బలమైన అనుబంధ సంస్థలు కూడా బ్యాంకుకు మంచి విలువను తెచ్చి పెడుతున్నాయి.

టెక్నికల్‌ వ్యూ
బయాస్‌: పాజిటివ్‌
సపోర్ట్: రూ.550
రెసిస్టెన్స్‌: రూ.570, రూ.574

డైలీ ఛార్ట్‌ ప్రకారం... దీని 50-DMAను 20-DMA దాటిన తర్వాత, జులై మధ్య కాలం నుంచి SBI షేర్లు పాజిటివ్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ రెండు నెలల్లో ఈ షేరు 16.5 శాతం లాభపడింది.

గత నాలుగు రోజులుగా, డైలీ చార్ట్‌లో, బొలింగర్ బ్యాండ్ హై ఎండ్‌ (రూ.563) పైన స్టాక్‌ కొనసాగుతోంది. వీక్లీ చార్ట్‌ ప్రకారం చూస్తే, బొలింగర్ బ్యాండ్ హైయ్యర్‌ ఎండ్‌కు (రూ.570) దూరంగా ఉంది.

14-RSI, స్లో స్టోకాస్టిక్ (Slow Stochastic) వంటి కీ మొమెంటం ఓసిలేటర్లు ఓవర్‌బాట్ జోన్‌లో ఉన్నప్పటికీ, ఇప్పటికీ బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. MACD, డైరెక్షనల్ ఇండెక్స్ (Directional Index) కూడా అనుకూలంగా ఉన్నాయి.

అప్‌సైడ్‌లో, కొనుగోళ్లు ఇంకా ఊపందుకోవాలంటే స్టాక్ రూ.570-574 శ్రేణిని అధిగమించి నిలదొక్కుకోవాలి. డౌన్‌సైడ్‌లో, రూ.550 స్థాయి దీని తక్షణ మద్దతు. ఇక్కడ నిలబడలేకపోతే స్టాక్ రూ.535కి జారిపోతుంది, ఇది స్టాక్‌ 20-DMA.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 14 Sep 2022 02:35 PM (IST) Tags: SBI State Bank Of India 5 Trillion Market Cap SBI Shares

సంబంధిత కథనాలు

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Electric SUV Space: ఎలక్ట్రిక్‌ SUVల కోసం ₹4 వేల కోట్ల ప్లాన్‌లో మహీంద్ర

Stock Market Crash: రూపాయి ఆల్‌టైమ్‌ లో - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌తో రూ.5లక్షల కోట్లు ఆవిరి!

Stock Market Crash: రూపాయి ఆల్‌టైమ్‌ లో - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌తో రూ.5లక్షల కోట్లు ఆవిరి!

Mahindra & Mahindra Shares: ఆర్‌బీఐ దెబ్బకు మహీంద్ర ఫైనాన్షియల్‌ మైండ్‌ బ్లాంక్‌, షేర్లు డౌన్‌

Mahindra & Mahindra Shares: ఆర్‌బీఐ దెబ్బకు మహీంద్ర ఫైనాన్షియల్‌ మైండ్‌ బ్లాంక్‌, షేర్లు డౌన్‌

Tata Group Shares: 25% జంప్‌ మీద టాటా షేర్ల కన్ను, ఇదిగో వాటి లిస్ట్‌!

Tata Group Shares: 25% జంప్‌ మీద టాటా షేర్ల కన్ను, ఇదిగో వాటి లిస్ట్‌!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల