By: Rama Krishna Paladi | Updated at : 13 Aug 2023 05:33 PM (IST)
టాప్ 10 కంపెనీల మార్కెట్ విలువ ( Image Source : Pexels )
Top 10 Companies:
గత వారం స్టాక్ మార్కెట్లు రాణించలేదు. దాదాపుగా ఐదు సెషన్లలోనూ ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆఖరి మూడు రోజుల్లో అయితే భారీ పతనమే చవిచూశాయి. ఫలితంగా దేశంలోని టాప్-10 కంపెనీల మార్కెట్ విలువ రూ.74,603 కోట్ల మేర తగ్గింది. అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఎక్కువ నష్టపోయింది. బెంచ్‌మార్క్ బీఎస్‌ఈ సెన్సెక్స్ 398 పాయింట్ల మేర పతనమైంది.
ఐసీఐసీఐ బ్యాంకు, హిందుస్థాన్ యునీలివర్, ఇన్ఫోసిస్, ఐటీసీ కంపెనీల మార్కెట్ విలువ తగ్గగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏకంగా రూ.25,011 కోట్లు నష్టపోయింది. దాంతో దాని మార్కెట్ విలువ రూ.12,22,392 కోట్లకు చేరుకుంది.
ఐసీఐసీఐ బ్యాంకు రూ.12,781 కోట్లు నష్టపోవడంతో మార్కెట్ విలువ రూ.6,66,512 కోట్లకు చేరుకుంది. ఇక టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ.11,096 కోట్లు నష్టపోయింది. మార్కెట్ విలువ రూ.4,86,812 కోట్లకు వచ్చింది. హిందుస్థాన్ యునీలివర్ మార్కెట్ విలువ రూ.10,396 కోట్లు తగ్గి రూ.5,87,901 కోట్లు, ఐటీసీ రూ.7,726 కోట్లు తగ్గి రూ.5,59,159 కోట్లకు చేరుకున్నాయి.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ.4,935 కోట్లు ఆవిరై రూ.4,27,996 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.2,656 కోట్లు తగ్గి రూ.5,69,406 కోట్లకు చేరాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.25,607 కోట్ల సంపద పోగేసింది. మార్కెట్ విలువను రూ.17,23,878 కోట్లకు పెంచుకుంది. టీసీఎస్ విలువ రూ.2,5479 కోట్లు పెరిగి రూ.12,62,134 కోట్లు, ఎస్బీఐ రూ.847 కోట్లు పెరిగి రూ.5,12,451 కోట్లకు చేరుకున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్-10లో మొదటి స్థానం నిలబెట్టుకుంది. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హిందుస్థాన్ యునీలివర్, ఇన్ఫోసిస్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
శుక్రవారం నిఫ్టీ కీలకమైన సపోర్ట్ లెవల్స్‌ను బ్రేక్ చేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు తగ్గి 19,428 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 365 పాయింట్లు తగ్గి 65,322 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. 342 పాయింట్లు తగ్గి 44,199 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి రూ.82.85 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం