News
News
X

Motilal Oswal: చీప్‌గా దొరుకుతున్న బెస్ట్ మిడ్ & స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌!

ఈ స్టాక్స్‌ సమీప భవిష్యత్తులో మంచి వృద్ధిని అందిస్తాయని బ్రోకరేజ్‌ నమ్ముతోంది.

FOLLOW US: 
Share:

Motilal Oswal: ప్రపంచ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలు బలహీనంగా ఉండడం, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FIIలు) నిరంతర అమ్మకాల మధ్య BSE మిడ్ & స్మాల్‌క్యాప్ సూచీలు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (year-to-date) 2% పైగా క్షీణించాయి. 

అయినా, BFSI (Banking, Financial Services and Insurance), ఆటో, లీజర్ & హాస్పిటాలిటీ స్టాక్స్‌ మీద దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్‌గా ఉంది. మోతీలాల్ టాప్ పిక్స్‌లో... అశోక్ లేలాండ్, భారత్ దాల్మియా, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, పూనావాలా ఫిన్‌కార్ప్ సహా 8 స్టాక్స్‌ ఉన్నాయి. ఈ స్టాక్స్‌ సమీప భవిష్యత్తులో మంచి వృద్ధిని అందిస్తాయని బ్రోకరేజ్‌ నమ్ముతోంది.

మోతీలాల్ ఓస్వాల్ సూచించిన టాప్‌-8 స్టాక్స్‌:

అశోక్ లేలాండ్ ‍(Ashok Leyland) 
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 146
అశోక్ లేలాండ్ గత ఏడాది కాలంలో దాదాపు 37% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.  42,853 కోట్లు. ఈ షేరు ప్రస్తుతం 52 వారాల గరిష్ట స్థాయి రూ. 169 నుండి 14% డౌన్‌లో ట్రేడవుతోంది.

దాల్మియా భారత్ ‍(Dalmia Bharat)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 182
గత 12 నెలల్లో దాల్మియా భారత్ దాదాపు 25% లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 34,277 కోట్లు. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.  1,989 నుంచి ఈ షేరు ఇప్పుడు 8% తక్కువలో ట్రేడవుతోంది.

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ (APL Apollo Tubes)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,201
APL అపోలో ట్యూబ్స్ గత ఏడాది కాలంలో దాదాపు 43% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 33,316 కోట్లు. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.  1,337 నుంచి 10% దిగువన ట్రేడవుతోంది.

జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ (Jubilant FoodWorks)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 459
జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ గత సంవత్సర కాలంలో దాదాపు 15% పడిపోయింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 30,277 కోట్లు. ఈ షేరు ప్రస్తుతం 52 వారాల గరిష్ట స్థాయి రూ. 652 నుంచి 30% డౌన్‌లో ట్రేడవుతోంది.

పూనావాలా ఫిన్‌కార్ప్ (Poonawalla Fincorp)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 294
పూనావాలా ఫిన్‌కార్ప్ గత ఏడాది కాలంలో 22% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 22,616 కోట్లు. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 344 నుంచి 15% దిగువన ట్రేడవుతోంది

మెట్రో బ్రాండ్స్‌ (Metro Brands)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 807
గత ఏడాది కాలంలో మెట్రో బ్రాండ్స్‌ దాదాపు 55% లాభపడింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 21,929 కోట్లు. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 980 నుంచి 18% తక్కువలో ట్రేడవుతోంది

ఏంజెల్ వన్ (Angel One)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 113
ఏంజెల్ వన్ గత 12 నెలల్లో దాదాపు 11% క్షీణించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 9,493 కోట్లు. ఈ షేరు ప్రస్తుతం 52 వారాల గరిష్ట స్థాయి రూ.  2,022 నుంచి 44% డౌన్‌లో ట్రేడవుతోంది.

లెమన్ ట్రీ హోటల్ (Lemon Tree Hotel)
ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 80
లెమన్ ట్రీ హోటల్ గత ఏడాదిలో దాదాపు 39% లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 6,358 కోట్లు. ఈ షేరు ప్రస్తుతం 52 వారాల గరిష్ట స్థాయి రూ. 103 నుంచి 22% దిగువన ట్రేడవుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 09 Mar 2023 01:15 PM (IST) Tags: Poonawalla Fincorp Ashok Leyland Motilal Oswal Bharat Dalmia Jubilant FoodWorks best mid cap stocks best small cap stocks

సంబంధిత కథనాలు

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Stock Market News: బాగా పెరిగి మళ్లీ డౌన్‌ - సెన్సెక్స్‌ 126, నిఫ్టీ 40 పాయింట్లు అప్‌!

Stock Market News: బాగా పెరిగి మళ్లీ డౌన్‌ - సెన్సెక్స్‌  126, నిఫ్టీ 40 పాయింట్లు అప్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Mamaearth IPO: మామఎర్త్‌ ఐపీవోకి బ్రేక్‌, పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టిన స్కిన్‌ కేర్ కంపెనీ

Mamaearth IPO: మామఎర్త్‌ ఐపీవోకి బ్రేక్‌, పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టిన స్కిన్‌ కేర్ కంపెనీ

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!