సెమీ కండక్టర్ల కొరత వేధించినా, ముడి వనరుల ధర పెరిగినా రెండో త్రైమాసికంలో ఆటో మొబైల్, ట్రాక్టర్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రాణించింది. 2021, సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో 214 శాతం లాభాలను నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన రూ.1,929 కోట్ల లాభం ఆర్జించింది. నిర్వహణ పరమైన ప్రదర్శనతో లాభాలు నమోదు చేసింది. ఆపరేషన్స్ రెవెన్యూ 14.8 శాతం పెరిగి రూ.13,305 కోట్లుగా ఉంది. రూ.12,348 కోట్లుగా వేసిన అంచనాలను అధిగమించింది.
ఆటో మొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఈ క్వార్టర్లో 99,334 వాహనాలను విక్రయించింది. 9 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ట్రాక్టర్ల విక్రయాలు మాత్రం 5 శాతం తగ్గి 88,920గా నమోదయ్యాయి. నిర్వహణ స్థాయిల్లో ఈబీఐటీడీఏ ఆదాయం 19.3 శాతం తగ్గి రూ.1,660 కోట్లుగా నమోదైంది. ముడి వనరుల ధరల పెరుగుదలతో లాభశాతం 530 బేసిస్ పాయింట్లు తగ్గింది.
'ఆటో, వ్యవసాయ వ్యాపారాల లాభశాతంపై ధరల ప్రభావం కనిపించింది. మేం వ్యయ నియంత్రణ, వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టడంతో ఆ ప్రభావాన్ని బాగా తగ్గించాం' అని గ్రూప్ సీఎఫ్‌వో మనోజ్ భట్ తెలిపారు.
'ఆటోమోటివ్ సెగ్మెంట్లో మాకు మంచి డిమాండ్ ఉంది. బుకింగ్స్ బాగున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీ కండక్టర్ల కొరత.. ఉత్పత్తి, అమ్మకాలపై ప్రభావం చూపించింది. ఇక ఫామ్ బిజినెస్‌లో క్యూ2లో అత్యధిక పీబీఐటీ నమోదు చేశాం. మార్కెట్ వాటాలో 1.9 శాతం వృద్ధి నమోదైంది' అని ఎం అండ్ ఎం తెలిపింది. మంగళవారం కంపెనీ షేరు ధర రూ.892 వద్ద ముగిసింది. 3.8 శాతం అంటే రూ.32.65 లాభపడింది.
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి