By: ABP Desam | Updated at : 22 Dec 2023 02:42 PM (IST)
సంచలనం సృష్టించిన టాప్-10 IPOలు
Top-10 IPOs in 2023: ఈ సంవత్సరం IPO (Initial Public Offering) సంవత్సరంగా గుర్తుండిపోతుంది. 2023లో, చాలా కంపెనీలు IPOల ద్వారా డబ్బు సంపాదించడమే కాకుండా, ఇన్వెస్టర్లకు కూడా డబ్బులు సంపాదించి పెట్టాయి. డిసెంబర్ నెల సగం దాటిన తర్వాత కూడా కొన్ని IPOలు దలాల్ స్ట్రీట్‌లోకి వచ్చాయంటే, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల మార్కెట్‌లో ఎంత బూమ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
2023 సంవత్సరంలో చాలా పెద్ద IPOలు అరంగేట్రం చేశాయి. BSE సెన్సెక్స్ ఇటీవల 70,000 మైలురాయిని దాటిందంటే, ఈ చారిత్రాత్మక సంఘటన వెనకు IPOల పాత్ర లేదని ఎవ్వరూ చెప్పలేరు. ఈ ఏడాది వచ్చిన కొన్ని ఐపీవోలు భారీ లాభాలను ఆర్జించగా మరికొన్ని నిరాశపరిచాయి. కానీ, మొత్తంగా చూస్తే, ఈ సంవత్సరం IPOలపై పెట్టుబడిదార్లు చాలా ప్రేమను కురిపించారు, అదే స్థాయిలో రిటర్న్ గిఫ్ట్స్ పొందారు.
ఈ సంవత్సరంలోని టాప్ IPOలు ఇవి:
రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా గ్రూప్ IPO
ఈ ఏడాది IPOల్లో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు టాటా టెక్నాలజీస్ (Tata Technologies IPO). రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత, తమ కంపెనీల ఐపీఓను ప్రారంభించనున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. దీంతో ఈ ఐపీఓ విషయంలో మార్కెట్‌లో చాలా ఉత్కంఠ నెలకొంది. చివరకు, 2023 నవంబర్ 22న IPO ప్రారంభమైంది, 69.43 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. నవంబర్ 30న, రూ.1200 వద్ద NSEలో లిస్ట్ అయింది. పెట్టుబడిదార్లు 140% ప్రీమియం పొందారు.
87.5 శాతం ఇచ్చిన IREDA IPO
ఆ తర్వాత ఇరెడా (Indian Renewable Energy Development Agency) IPO గురించి చెప్పుకోవాలి. ఇది, 2023 నవంబర్ 29న 87.5% ప్రీమియంతో స్టాక్ మార్కెట్‌లో ప్రారంభమైంది. దీని ఇష్యూ ధర రూ.32, లిస్టింగ్ రోజు ముగిసే సమయానికి రూ.59.99కి చేరుకుంది.
నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఐపీవో (Netweb Technologies IPO) ఇష్యూ ధర రూ.500 అయితే, BSEలో రూ.942.5 వద్ద లిస్ట్ అయింది. ఈ విధంగా పెట్టుబడిదార్లకు 89.4% రాబడిని అందించింది.
జేబులు నింపిన సెన్కో గోల్డ్, JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
సెన్కో గోల్డ్ లిమిటెడ్ షేర్ల లిస్టింగ్ (Senco Gold IPO) జూలై 14న జరిగింది. ఇష్యూ ధర రూ.317 అయితే.. NSEలో రూ.430 వద్ద, BSEలో రూ.431 వద్ద 35.6% ప్రీమియంతో జర్నీ స్టార్ట్ చేశాయి. ఈ సంవత్సరం JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (JSW Infrastructure IPO) కూడా తన IPOతో అక్టోబర్ 3న వచ్చింది. ఇష్యూ ప్రైస్ రూ. 119 - ఇది రూ.143 వద్ద లిస్ట్ అయింది. తద్వారా, ఈ ఐపీఓ ఇన్వెస్టర్లకు 32.18% లాభం వచ్చింది.
వీటిపైనా ప్రేమ కురిపించిన ప్రజలు
2023లో, బ్లూ జెట్ హెల్త్‌కేర్, హోనాస, ఫ్లెయిర్ రైటింగ్, సెల్లో వరల్డ్ IPOలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. బ్లూ జెట్ హెల్త్‌కేర్ IPO 2023 నవంబర్ 1న లిస్ట్ అయింది, సబ్‌స్క్రైబర్లకు దాదాపు 20% రాబడిని ఇచ్చింది. ఫ్లెయిర్ రైటింగ్ 2023 డిసెంబర్ 1న మార్కెట్‌ను తాకింది, పెట్టుబడిదార్లకు దాదాపు 49% రిటర్న్స్ అందించింది. సెల్లో వరల్డ్ సుమారు 28% ప్రీమియంతో లిస్ట్ అయింది.
హోనాస కన్స్యూమర్ లిమిటెడ్ (Mamaearth) IPO గురించి మార్కెట్‌లో చాలా చర్చ జరిగింది. కానీ, అది కేవలం 4% రాబడిని మాత్రమే ఇచ్చింది. యాత్ర ఆన్‌లైన్‌పై (Yatra Online IPO) గురించి కూడా ఇన్వెస్టర్లు మాట్లాడుకున్నా, అది కూడా తుస్‌మంది, డిస్కౌంట్‌లో లిస్ట్ అయింది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్ - ఇన్వెస్టర్ల డబ్బు 47 శాతం పెరిగింది
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy