By: Arun Kumar Veera | Updated at : 21 Jan 2025 11:20 AM (IST)
Twitter ( Image Source : Other )
SEBI Green Signals To Launch 6 IPOs: అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లైల్ ప్రమోట్ చేసిన హెక్సావేర్ టెక్నాలజీస్, మౌలిక సదుపాయాల సంస్థ విక్రాన్ ఇంజినీరింగ్, పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్, అజాక్స్ ఇంజినీరింగ్ కంపెనీలు ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా నిధులు సేకరించడానికి 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) నుంచి అనుమతి పొందాయి. గుజరాత్‌కు చెందిన స్కోడా ట్యూబ్స్, వినియోగదారు ఉత్పత్తుల తయారీ సంస్థ ఆల్ టైమ్ ప్లాస్టిక్స్‌కు కూడా IPO లాంచ్ చేయడానికి సెబీ ఆమోదం లభించింది. ఈ కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ. 10,000 కోట్లకు పైగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ ఆరు కంపెనీలు 2024 సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య సెబీకి తమ ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించాయి. మార్కెట్ రెగ్యులేటర్ నుంచి జనవరి 14-17 తేదీల మధ్య పరిశీలన లేఖలు అందుకున్నాడు. అంటే, ఐపీవో ప్రారంభించేందుకు సెబీ ఈ ఆరు కంపెనీలకు ప్రాథమిక అనుమతి ఇచ్చింది.
హెక్సావేర్ టెక్నాలజీస్ (Hexaware Technologies IPO)
ఐటీ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS). ఈ IPOలో, కార్లైల్ గ్రూప్ ఆధ్వర్యంలోని ప్రమోటర్లు CA మాగ్నమ్ హోల్డింగ్స్ తమ వాటాను విక్రయించనున్నారు. ఈ కంపెనీలో CA మాగ్నమ్ హోల్డింగ్స్ వాటా 95.03 శాతం. మొత్తం రూ.9,950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను OFS ద్వారా కంపెనీ విక్రయిస్తుంది.
విక్రాన్ ఇంజనీరింగ్ (Vikran Engineering IPO)
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ EPC కంపెనీ విక్రాన్ ఇంజినీరింగ్ ప్రతిపాదిత IPOలో ప్రమోటర్లు రూ. 900 కోట్ల విలువైన ఫ్రెష్ ఈక్విటీ షేర్లు & రూ. 100 కోట్ల విలువైన OFS షేర్లను అమ్మకానికి పెడతారు.
PMEA సోలార్ టెక్ సొల్యూషన్స్ (PMEA Solar Tech Solutions IPO)
PMEA సోలార్ టెక్ సొల్యూషన్స్ IPOలో రూ. 600 కోట్ల తాజా ఇష్యూ ఉంటుంది & OFS ద్వారా వాటాదారులు & ప్రమోటర్లు రూ. 1.12 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు.
అజాక్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (AJAX Engineering IPO)
అజాక్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ IPOలో 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో ఉంచుతున్నారు. ఈ కంపెనీకి మద్దతునిస్తున్న పెట్టుబడి నిర్వహణ సంస్థ కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను OFSలో అమ్ముతోంది.
ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ (All Time Plastics IPO)
రూ. 350 కోట్ల తాజా ఇష్యూతో 52.5 లక్షల షేర్ల OFSతో IPOను ప్రారంభించేందుకు ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ సిద్ధంగా ఉంది. ఈ ఐపీఓలో ప్రమోటర్లు కైలాష్ పూనంచంద్ షా, భూపేశ్ పూనంచంద్ షా, నీలేష్ పూనంచంద్ షా రూ. 17.5 లక్షల విలువైన షేర్లను విక్రయిస్తారు.
స్కోడా ట్యూబ్స్ (ScodaTubes IPO)
స్కోడా ట్యూబ్స్ కూడా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల ఇష్యూ ద్వారా రూ. 275 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ట్రంప్ నిర్ణయాల వైపు పసిడి చూపు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Mega IPO: ఫస్ట్ లిస్టింగ్‌లో దూసుకెళ్లిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?
Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!
Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!
Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి
Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్ క్లియర్ - ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే?
Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
IND vs SA 1st ODI Live Streaming: రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే.. మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడాలంటే..
Bigg Boss 9 Telugu : బిగ్బాస్ డే 83 రివ్యూ... తనుజాకు తప్పని మొట్టికాయలు... వెళ్ళిపోతానంటూ సంజన వితండవాదం... నాగ్ వార్నింగులు ఎవరెవరికి ?
Pawan Kalyan vs Congress: పవన్ కల్యాణ్ క్షమాపణకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ - లేకపోతే ?