By: ABP Desam | Updated at : 21 Dec 2023 01:33 PM (IST)
ఈ ఏడాది బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్
Top-10 Mid Cap Funds in 2023: ఈ సంవత్సరం (2023) స్టాక్ మార్కెట్లకు బాగా కలిసొచ్చింది. మార్కెట్లు పెరగడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) కూడా బాగా పని చేశాయి. ఈ సంవత్సరం, దాదాపు ప్రతి కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల కంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేశాయి, పెట్టుబడిదార్లకు ఆకర్షణీయమైన రాబడిని (Returns on Midcap Funds) అందించాయి.
2023లో, రాబడుల పరంగా అత్యుత్తమంగా నిలిచిన 10 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇప్పుడు చూద్దాం. టాప్-10 లిస్ట్‌లో ఉన్న అన్ని ఫండ్స్ 2023లో ఇప్పటి వరకు (YTD) 40 శాతం తగ్గకుండా రిటర్న్స్ (Returns) ఇచ్చాయి. అంతేకాదు, ఇవన్నీ బెంచ్‌మార్క్‌ల కంటే మెరుగ్గా రాణించాయి.
2023 ప్రారంభం నుంచి, JM మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఇది, తన సబ్‌స్క్రైబర్లకు దాదాపు 48 శాతం రాబడిని ఇచ్చింది.
సెన్సెక్స్, నిఫ్టీ కంటే రెట్టింపు రిటర్న్స్
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు, BSE సెన్సెక్స్ దాదాపు 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో NSE నిఫ్టీ దాదాపు 18 శాతం పైగా జంప్ చేసింది. వీటితో పోల్చి చూస్తే, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, టాప్-10 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రెట్టింపు పైగా లాభాలు సాధించాయి.
కేవలం 3 ఫండ్స్‌లోనే 30% కంటే తక్కువ రాబడి
ప్రస్తుతం, మిడ్ క్యాప్ కేటగిరీలో 29 మ్యూచువల్ ఫండ్ పథకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో, PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ అత్యల్ప పనితీరుతో ఉంది. విశేషం ఏంటంటే, ఈ ఏడాది ఇప్పటివరకు 21.64 శాతం రాబడిని అందించిన ఈ ఫండ్... సెన్సెక్స్ & నిఫ్టీ కంటే కూడా మెరుగ్గా ఉంది. PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ కాకుండా, మిడ్ క్యాప్ కేటగిరీలో మరో రెండు పథకాలు మాత్రమే 30 శాతం కంటే తక్కువ రాబడిని తీసుకొచ్చాయి. ఆ రెండు ఫండ్స్... యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ & UTI మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వారి రాబడులు వరుసగా 28.60 శాతం & 29.61 శాతం.
2023లో టాప్-10 మిడ్ క్యాప్ ఫండ్స్ (YTD రిటర్న్స్):
JM మిడ్ క్యాప్ ఫండ్ ---- 47.42%
నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ---- 46.89%
మహీంద్ర మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ ---- 46.04%
HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ---- 44.01%
వైట్‌ఓక్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ ---- 43.57%
మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ---- 42.31%
ICICI ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ ---- 41.59%
ITI మిడ్ క్యాప్ ఫండ్ ---- 41.45%
టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్ ---- 40.76%
సుందరం మిడ్ క్యాప్ ఫండ్ ---- 40.06%
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: సీనియర్ సిటిజన్లకు నమ్మకంగా 9 శాతం పైగా వడ్డీ ఆదాయం, వేరే చోట రిస్క్ చేయడం ఎందుకు?
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్ ఆహ్వానించిన టీటీడీ