search
×

Upcoming IPO: స్టాక్‌ మార్కెట్‌లోకి రానున్న లెన్స్‌కార్ట్‌ - IPO టార్గెట్‌ దాదాపు రూ.8,700 కోట్లు

Lenskart IPO: ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా 1 బిలియన్‌ డాలర్లను సేకరించడానికి సిద్ధమవుతున్న ఈ సుప్రసిద్ధ కంపెనీ, ఈ ఏడాది మే నెలలో ముసాయిదా పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధం అవుతోంది.

FOLLOW US: 
Share:

Lenskart IPO News: ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్ వరకు కళ్లజోళ్లు అమ్మే ఐవేర్ రిటైల్ కంపెనీ 'లెన్స్‌కార్ట్', స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు సిద్ధం అవుతోంది. దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ఐవేర్‌ కంపెనీ, సమీప భవిష్యత్‌లో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ప్రారంభించనుంది. IPO ద్వారా, ప్రైమరీ మార్కెట్ నుంచి 1 బిలియన్‌ డాలర్లను సేకరించడానికి ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత డాలర్‌-రూపాయి రేట్‌ ప్రకారం, 1 బిలియన్‌ డాలర్ల విలువను భారతీయ రూపాయల్లో చెప్పుకుంటే దాదాపు 8,700 కోట్ల రూపాయలు (రూ. 8669,82,36,400) అవుతుంది. IPO తీసుకురావడానికి ఈ సంవత్సరం మే నెలలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) వద్ద ముసాయిదా పత్రాలను (DRHP) దాఖలు చేయవచ్చు. 

లెన్స్‌కార్ట్ IPO వాల్యుయేషన్ గురించి ఆ కంపెనీ CEO పియూష్ బన్సాల్ ‍‌(Peyush Bansal) & కంపెనీలోని కీలక పెట్టుబడిదారులు ఇటీవలి వారాల్లో బ్యాంకర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ IPO ద్వారా లెన్స్‌కార్ట్ 10 బిలియన్‌ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకుంది, IPO మార్కెట్‌ నుంచి అందులో పదో వంతును (1 బిలియన్‌ డాలర్లు) సేకరించనుంది. అయితే, మార్కెట్ పరిస్థితులు & సెంటిమెంట్‌ను బట్టి IPOను ప్రారంభించే తేదీలను నిర్ణయిస్తారు.

మే నెలలో IPO - ఈ ఏడాదిలో లిస్టింగ్‌!
నేషనల్‌ మీడియా రిపోర్ట్‌ల ప్రకారం, ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోనే, ఈ కంపెనీ తన షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయాలని చూస్తోంది. దీని కంటే ముందు IPO ఓపెన్‌ చేయాలి కాబట్టి, ఈ ఏడాది మే నెల నాటికి SEBIకి IPO డ్రాఫ్ట్ పేపర్లను (DRHP) దాఖలు చేసేందుకు సిద్ధం అవుతోంది. 

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను బట్టి చూస్తే, 10 బిలియన్‌ డాలర్ల విలువ లక్ష్యం పెద్దది & దూకుడుగా తీసుకునే నిర్ణయం అవుతుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కంపెనీలో ఉన్న పెట్టుబడిదార్లు ప్రయోజనం పొందాలంటే IPO విలువను తగ్గించాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

లెన్స్‌కార్ట్‌ గురించి....
సాఫ్ట్‌ బ్యాంక్, టెమాసెక్ పెట్టుబడులు ఉన్న లెన్స్‌కార్ట్, మన దేశంలో ప్రముఖ కళ్లద్దాల సంస్థ. ఇది కళ్ళద్దాలు & కాంట్రాక్ట్ లెన్స్‌లను విక్రయిస్తుంది. ఈ కంపెనీకి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తుంది, సెల్లింగ్‌ స్టోర్స్‌ ఉన్నాయి. ఈ కంపెనీని 2010లో పియూష్ బన్సాల్ ప్రారంభించారు, ఆయన ప్రస్తుతం CEOగా పని చేస్తున్నారు. భారతదేశంలో లెన్స్‌కార్ట్ కార్యకలాపాలు లాభదాయకంగా ఉన్నాయి & కంపెనీ నిరంతరం విస్తరిస్తోంది. 2022 సంవత్సరంలో జపనీస్ కంపెనీని 400 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ కంపెనీ థాయిలాండ్‌లో ఆశాజనకంగా పని చేస్తోంది. గత ఏడాది జూన్‌లో జరిగిన రెండో రౌండ్‌లో లెన్స్‌కార్ట్ 200 మిలియన్‌ డాలర్లను సేకరించింది. ఈ మొత్తాన్ని కంపెనీ 5 బిలియన్ల విలువ వద్ద సేకరించారు. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు 

Published at : 17 Feb 2025 09:43 AM (IST) Tags: Peyush Bansal Lenskart Lenskart IPO Lenskart IPO Price Band Lenskart IPO Dates

ఇవి కూడా చూడండి

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి

Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్‌ క్లియర్‌ - ఎప్పుడు ఓపెన్‌ అవుతుందంటే?

Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్‌ క్లియర్‌ - ఎప్పుడు ఓపెన్‌ అవుతుందంటే?

Hexaware Technologies IPO: హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో ప్రైస్‌ బ్యాండ్‌ ఇదే - ఫిబ్రవరి 12 నుంచి లైవ్‌

Hexaware Technologies IPO: హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో ప్రైస్‌ బ్యాండ్‌ ఇదే - ఫిబ్రవరి 12 నుంచి లైవ్‌

New IPOs: డబ్బుతో సిద్ధంగా ఉండండి, త్వరలో 6 కొత్త IPOలు ప్రారంభం

New IPOs: డబ్బుతో సిద్ధంగా ఉండండి, త్వరలో 6 కొత్త IPOలు ప్రారంభం

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

టాప్ స్టోరీస్

CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న

CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న

YSRCP MLAs: అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు

YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు

KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం

KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy