అన్వేషించండి

Airtel Plan Rates: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు

Airtle Tariff Hikes: భారతి ఎయిర్‌టెల్ కూడా టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 03 నుంచి ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది.

Bharti Airtel -Reliance Jio Tariffs Hike: మొబైల్‌ ఫోన్‌ వినియోగదార్లకు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. ప్లాన్‌ ధరలు పెంచుతూ రిలయన్స్‌ జియో ప్రకటించిన వెంటనే, భారతి ఎయిర్‌టెల్ కూడా రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్‌ సిమ్‌ వినియోగించాలంటే యూజర్లు ఇకపై 10 శాతం నుంచి 21 శాతం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి.  

జులై 03 నుంచి కొత్త రేట్లు అమలు         
పెరిగిన భారతి ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లు జులై 03, 2024 నుంచి అమలులోకి వస్తాయి. ఆ తేదీ నుంచి పోస్ట్‌ పెయిడ్ & ప్రి-పెయిడ్ ప్లాన్ల రేట్లు పెరుగుతాయి. ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ప్రస్తుతం ఉన్న రేట్లు జులై 02వ తేదీ వరకు వర్తిస్తాయి.

భారతదేశంలోని టెలికాం కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే "ప్రతి వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం" (ARPU) రూ. 300 పైగా ఉండాలని భారతి ఎయిర్‌టెల్ స్టాక్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు తెలిపింది. ARPUనకు తగ్గట్లుగా వ్యాపార నమూనా ఉండాలని వెల్లడించింది. ARPU రూ. 300 దాటితే... నెట్‌వర్క్ టెక్నాలజీ & స్పెక్ట్రమ్‌ కోసం పెద్ద మొత్తంలో అవసరమయ్యే పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని, మూలధనంపై సాధారణ రాబడిని పొందగమని తాము నమ్ముతున్నట్లు ఎక్సేంజ్‌ పైలింగ్‌లో భారతి ఎయిర్‌టెల్‌ పేర్కొంది. సామాన్య ప్రజల బడ్జెట్‌పై ఎలాంటి భారం లేకుండా, ఎంట్రీ-లెవల్ ప్లాన్‌ రేట్లను చాలా తక్కువ మొత్తంలో (రోజుకు 70 పైసల కంటే తక్కువ) పెంచినట్లు వెల్లడించింది.

నిన్న ప్లాన్‌ రేట్లు పెంచిన రిలయన్స్ జియో          
గురువారం, రిలయన్స్ జియో కూడా తన మొబైల్ ప్లాన్‌ రేట్లను 12 శాతం నుంచి 27 వరకు పెంచింది. జియో కొత్త టారిఫ్‌లు కూడా జులై 03, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. జులై 02వ తేదీ వరకు ప్రస్తుత రేట్లే అమల్లో ఉంటాయి. రిలయన్స్‌ జియో... తన నెలవారీ (28 రోజులు) ప్లాన్‌లు, 2 నెలల ప్లాన్లు (56 రోజులు), 3 నెలల ప్లాన్లు (84 రోజులు), వార్షిక ప్లాన్ల (335 & 336 రోజులు) మొత్తాన్ని పెంచింది. 

28 రోజుల ప్లాన్‌ ధరలను 27 శాతం వరకు, 84 రోజుల ప్లాన్లను 20 శాతం వరకు రిలయన్స్‌ జియో పెంచింది. డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు, పోస్ట్ పెయిడ్ టారిఫ్‌ రేట్లను సైతం జియో పెంచింది. దీంతో... కొత్త ప్లాన్లు కనిష్టంగా రూ. 189 నుంచి గరిష్టంగా రూ. 3,599 వరకు చేరాయి. ప్రస్తుతం ఇవి కనిష్టంగా రూ. 155 - గరిష్టంగా రూ. 2,999 మధ్యలో ఉన్నాయి. జియో యాడ్‌-ఆన్‌ ప్లాన్ల కొత్త ధరలు కనిష్టంగా రూ. 29 నుంచి గరిష్టంగా రూ. 69 వరకు ఉన్నాయి. 

పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల విషయానికి వస్తే... ప్రస్తుతం రూ. 299 ప్లాన్‌ జులై 03 నుంచి రూ. 349 అవుతుంది. ప్రస్తుతం రూ. 399గా ఉన్న ప్లాన్‌ కోసం జులై 03 నుంచి రూ. 449 చెల్లించాల్సి వస్తుంది.

వాస్తవానికి, టెలికాం కంపెనీలు ఈ ఏడాది ప్రారంభంలోనే టారిఫ్‌ రేట్లు పెంచాల్సి ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఆగాయి.

మరో ఆసక్తికర కథనం: భారీగా పెరిగిన జియో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు, ఎంతో తెలిస్తే గుండె గుభేల్! 

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget