Hyundai Creta Price: హ్యుందాయ్ క్రెటాను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తక్కువకు కొనవచ్చు?, ఎక్కడ డబ్బు ఆదా అవుతుంది?
Hyundai Creta Engine Options: క్రెటాలో మూడు ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. మొదటిది 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్, రెండోది 1.5 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్, మూడోది 1.5 లీటర్ CRDi డీజిల్ ఇంజిన్.

Hyundai Creta Price, Mileage And Features In Telugu: హ్యుందాయ్ క్రెటా ఖచ్చితంగా ఒక అద్భుతమైన కారు. ఈ బండి రోడ్డు మీదకు వచ్చిందంటే మిగిలిన కార్లు చిన్నబోతాయి. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో, ఏ నగరంలో ఈ SUV తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుందాం.
భారతదేశంలో, హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర (Hyundai Creta ex-showroom price) రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆన్-రోడ్ ధరలో పన్నులు, RTO ఛార్జీలు & బీమా వంటివి ఉంటాయి, ఇవి నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర ఎంత? (Hyundai Creta Cost)
హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో దాదాపు రూ. 13.77 లక్షలు
వరంగల్‌లో దాదాపు రూ. 13.71 లక్షలు
విజయవాడలో దాదాపు రూ. 13.72 లక్షలు
విశాఖపట్నంలో దాదాపు రూ. 13.73 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాల్లోని ధరల్లోనూ ఇలాగే స్వల్ప తేడాలు ఉంటాయి. డీలర్‌షిప్ & బీమా కంపెనీలపై ధర ఆధారపడి ఉంటుంది, కాబట్టి వాస్తవ ధర కొద్దిగా మారుతుంది.
ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ తక్కువ?
దిల్లీలో హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.12.83 లక్షలు. నోయిడాలో అదే మోడల్‌ను రూ. 12.86 లక్షల ఆన్-రోడ్ ధరకు పొందవచ్చు, ఇది దిల్లీ ధర కంటే దాదాపు రూ. 3,000 ఎక్కువ. మీరు ధర ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంటే, హైదరాబాద్ కంటే దిల్లీ దాదాపు రూ. 91,000 తక్కువ ధరకు క్రెటాను సొంతం చేసుకోవచ్చు.
హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు
హ్యుందాయ్ క్రెటాను కేవలం కారుగానే చూడకూడదు. ఇది.. స్టైల్, కంఫర్ట్ & అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల గొప్ప కలయిక. దీని ఉన్నత స్థాయి లక్షణాలు ఈ కారును అత్యధికంగా అమ్ముడైన SUVల్లో నిలిపాయి. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది Android Auto & Apple CarPlay లకు మద్దతు ఇస్తుంది. హ్యుందాయ్ క్రెటాలో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ అన్ని లక్షణాల కారణంగా, క్రెటా డ్రైవింగ్ ఈజీగా ఉండడమే కాకుండా విలాసవంతమైన అనుభూతి కూడా లభిస్తుంది.
ఇంజిన్ & పనితీరు
మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయవచ్చు. మొదటిది - 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్, నేచరల్లీ ఆస్పిరేటెడ్ & ఇంధన సామర్థ్యం గల డ్రైవింగ్‌ను అందిస్తుంది. రెండోది - 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్, ఇది ఎక్కువ పవర్ & స్పోర్టీ అనుభవాన్ని ఇస్తుంది. మూడోది - 1.5 లీటర్ CRDi డీజిల్ ఇంజిన్, ఇది సుదూర ప్రయాణానికి & అద్భుతమైన మైలేజీకి బాగుంటుంది.
మైలేజ్ పరంగా, హ్యుందాయ్ క్రెటా లీటరుకు 17 కిలోమీటర్ల నుంచి లీటరుకు 21 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఈ కారులో మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.





















