అన్వేషించండి

Mahindra New SUV: మహీంద్రా XUV7XO బుకింగ్, లాంచ్ డేట్ ఫిక్స్.. ధర ఎంత, కొత్త టీజర్ లో ఇవి గమనించారా

Mahindra New SUV XUV700 | మహీంద్రా XUV7XO బుకింగ్స్ డిసెంబర్ 15న ప్రారంభం కానుంది. 2026 జనవరి నెలలో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. దాని డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు చూడండి.

మహీంద్రా తన రాబోయే కొత్త SUV XUV7XO కు సంబంధించి మరో టీజర్‌ను విడుదల చేసింది. ఈ SUVని భారత మార్కెట్లోకి జనవరి 5, 2026న విడుదల చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. మహీంద్రా XUV7XO ప్రీ-బుకింగ్ డిసెంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. దీని కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్ కట్టాలి. Mahindra XUV7XO వాస్తవానికి XUV700 మోడల్‌కు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వేరియంట్. ఇది డిజైన్,  ఫీచర్ల పరంగా అనేక పెద్ద మార్పులతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

కొత్త టీజర్‌లో కొత్త రంగు, కొత్త లుక్ చూడవచ్చు

కొత్త టీజర్‌లో మహీంద్రా XUV7XO ఎరుపు రంగులో చూడవచ్చు. ఇది మునుపటి కంటే మరింత స్పోర్టీ లుక్ ఇస్తుంది. SUVలో కొత్త ఫ్రంట్ గ్రిల్, నలుపు రంగు ORVMలు, కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌ల డిజైన్ 2 భాగాలుగా కనిపిస్తుంది. దీనితో పాటు, SUVలో మార్పు చేసిన బంపర్, కొత్త LED DRLలు, వెనుక భాగంలో పూర్తి-వెడల్పు లైట్ బార్‌ను కూడా ఆశిస్తున్నారు. అయితే బోనెట్, ఫెండర్, డోర్స్ మెటల్ షీట్‌లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

లోపలి భాగం మరింత ప్రీమియం, హై-టెక్ 

Mahindra XUV7XO ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ఇందులో 3 స్క్రీన్‌లతో కూడిన పెద్ద సెటప్ ఉండవచ్చు.  ఇటీవల XEV 9eలో కూడా అలాగే కనిపించింది. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్  ఉండవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ముందు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్, స్లైడింగ్ సెకండ్-రో సీట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో (Android Auto), ఆపిల్ కార్ ప్లే (Apple CarPlay), వైర్‌లెస్ ఛార్జర్ వంటి సౌకర్యాలు లభిస్తాయని భావిస్తున్నారు.

ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్):
బేస్ మోడల్ (MX పెట్రోల్ 7-సీటర్): ₹13.66 లక్షలకు ప్రారంభం
టాప్ మోడల్ (AX7L డీజిల్ AT AWD): సుమారు ₹23.71 లక్షలు
ఆటోమేటిక్ వేరియంట్ (అత్యంత చవకైనది): సుమారు ₹21.14 లక్షలు (AX5 పెట్రోల్ AT) అని ప్రస్తుతానికి ప్రచారం జరుగుతోంది. కొత్త మోడల్ ధరలపై కంపెనీ మరిన్ని వివరాలు త్వరలో అందజేయనుంది. రెండు రోజుల్లో బుకింగ్స్ ప్రారంభించనున్నామని మహీంద్రా కంపెనీ తెలిపింది.

భద్రత, ఇంజిన్‌లో కొత్తగా ఏముంది.. 

భద్రత కోసం మహీంద్రా XUV7XOలో లెవెల్-2 ADAS మరింత మెరుగుపరిచారు. మహీంద్రా XUV7XOలో  7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సహా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటాయి. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు. ఇందులో అదే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ ఎంపికలు ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 200 PS ఎనర్జీ ఇస్తుంది. అయితే డీజిల్ ఇంజిన్ 185 PS వరకు శక్తినిస్తుంది. డీజిల్ వేరియంట్‌లో మాత్రమే AWD ఆప్షన్ లభిస్తుంది.

Also Read: New MG Hector : హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!
ఈ కారు స్పీడ్‌ గంటకు 654km, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా ఈ వేగం ముందు బలాదూర్‌!
పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget