Honda CB300F: హోండా సీబీ300ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ వచ్చేసింది - ధర ఎంత ఉంది? వేటితో పోటీ?
హోండా కొత్త స్ట్రీట్ ఫైటర్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. అదే హోండా సీబీ300ఎఫ్.
Honda CB300F Launch: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా కొత్త 2023 సీబీ300ఎఫ్ స్ట్రీట్ ఫైటర్ బైక్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.70 లక్షలుగా ఉంది. ఈ ధర మునుపటి మోడల్ కంటే చాలా తక్కువ. దీని డీలక్స్ వేరియంట్ ధర రూ. 2.26 లక్షలు కాగా డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 2.29 లక్షలుగా ఉంది. ఇవి రెండూ ఎక్స్-షోరూం ధరలే. కొత్త 2023 హోండా సీబీ300ఎఫ్ మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. వీటిలో స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ ఉన్నాయి.
ఇంజిన్ ఎలా ఉంది?
2023 హోండా సీబీ300ఎఫ్ బీఎస్6 స్టేజ్ II 293 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 24 బీహెచ్‌పీ శక్తిని, 25.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్ అలాగే ఉంది. స్లిప్, అసిస్ట్ క్లచ్ కూడా ఈ బైక్‌లో ఉన్నాయి. ఇది అదనపు భద్రత, నియంత్రణ కోసం హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
సస్పెన్షన్ కోసం ఇది ఆకర్షణీయమైన గోల్డెన్ ఫినిషింగ్, 5 స్టెప్ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ యూనిట్‌తో కూడా యూఎస్‌డీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉంది. ఈ బైక్‌లో బలమైన 150 సెక్షన్ వెనుక టైర్‌ను కలిగి ఉంది. రెండు చక్రాలపై డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఒకే డిస్క్ బ్రేక్‌ను పొందుతుంది.
కంపెనీ ఏం చెప్పింది?
కొత్త 2023 హోండా సీబీ300ఎఫ్ విడుదల గురించి హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడారు. "మేం 2023 OBD-II కంప్లైంట్ CB300Fని పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాం. మా కస్టమర్లందరికీ ఇది అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది." అన్నారు. దీని బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వ్యక్తులు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇది సుజుకి జిక్సర్ 250ఎస్, కేటీఎం 250లకు పోటీగా ఉంది.
మరోవైపు జపనీస్ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్స్ తన కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అదే హోండా ఎలివేట్ ఎస్‌యూవీ. ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అధికారికంగా లాంచ్ అయింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. హోండా నుంచి వచ్చిన ఈ కొత్త కారు కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ క్రెటాతో కూడా ఎలివేట్ పోటీ పడనుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial