అన్వేషించండి

AI Car in Shark Tank India Show: ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షోలో సెల్ఫ్ డ్రైవింగ్ AI కార్ - చిన్న గ్యారేజ్‌లోనే తయారు చేశాడట!

Shark Tank India: ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ అనే షోలో ఏఐ కారును తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒక యువకుడు. అంతే కాకుండా జడ్జిలను అందులో టెస్ట్ డ్రైవ్‌కు కూడా తీసుకెళ్లాడు.

AI Car In Mumbai: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) అనేది ప్రపంచ భవిష్యత్తు అని అంటుంటారు. అందుకే ప్రస్తుతం మనుషులు రోజూవారీ ఉపయోగించే దాదాపు ప్రతీ వస్తువులో AI టెక్నాలజీ ఉండాలని పరిశోధకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే AI కార్లు కూడా తయారవుతున్నాయి. తాజాగా ఒక చిన్న గ్యారేజ్ నుంచి ముంబాయ్ రోడ్లపైకి వచ్చాయి AI కార్లు. తాజాగా ముంబాయ్ ఫిల్మ్ సిటీ రోడ్‌పై AI కార్ ప్రయాణం సంచలనంగా మారింది. ‘షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3’లో తాజాగా AI కార్లు అనే ఐడియాతో జడ్జిల ముందుకు వచ్చాడు మహాదేవ్ నక్షానే అనే యువకుడు. AI కార్లు లాంటి భవిష్యత్తుకు సంబంధించిన ఐడియాతో జడ్జిలను ఇంప్రెస్ చేశాడు మహాదేవ్.

ఎంత ఖర్చయ్యింది?

మహారాష్ట్రలోని యావత్మల్ అనే చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి మహేదేవ్ నక్షానే. ఇప్పటికే తను ‘AI కార్స్’ అనే సంస్థను కూడా స్థాపించాడు. హైడ్రోజన్‌ను ఉపయోగించి AI కార్లను తయారు చేయాలని ఉద్దేశ్యంతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఈ ఐడియా అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షోలో కంటెస్టెంట్‌గా వచ్చాడు. 27 ఏళ్ల మహాదేవ్.. తన టీమ్‌తో కలిసి ఈ AI కారును కేవలం 18 నెలల్లోనే తయారు చేశానని, అది కూడా తన ఇంటి వెనుక ఉన్న చిన్న గ్యారేజ్‌లోనే దీన్ని తయారు చేశానని చెప్పడంతో జడ్జిలు ఆశ్చర్యపోయారు. దీనిని తయారు చేయడానికి రూ.60 లక్షలు ఖర్చు అయ్యిందని, ఇది హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో నడుస్తుందని తెలిపాడు. ఒక సెల్‌ను రిఫ్యూయెల్ చేయడానికి 5 నిమిషాలు పడుతుందని, దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా రన్ అవుతుందని తెలిపాడు. 

రూ.2 కోట్లు కావాలి..

తను తయారు చేసిన AI కార్ గురించి వివరించిన మహేదేవ్.. తన AI కార్స్ సంస్థను ముందుకు తీసుకువెళ్లడానికి రూ.2 కోట్ల పెట్టుబడి కావాలని కోరాడు. దీనికి బదులుగా కంపెనీలో 4 శాతం షేర్‌ను ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. మహాదేవ్ చెప్పిన ఐడియా జడ్జిలకు నచ్చింది. కానీ అనుపమ్ మిట్టల్‌కు మాత్రం ఈ కారులో మనుషులు కూర్చోగలరా అని డౌట్ వచ్చింది. దీంతో స్పోర్ట్స్ కారులా కనిపించే AI కారును తమ ముందుకు తీసుకొచ్చాడు మహాదేవ్. ఆ తర్వాత అనుపమ్ మిట్టల్, నమితా థాపర్, వినీత సింగ్ కలిసి అందులో టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లారు. ఈ కారును మహాదేవే డ్రైవ్ చేశాడు. కాసేపటికీ తను స్టీరింగ్‌ను వదిలేయగా.. ఆ తర్వాత బాధ్యత అంతా AI తీసుకుంది. ఎక్కడ టర్న్ తీసుకోవాలో, ఎక్కడ ఎంత స్పీడ్‌గా వెళ్లాలో AI చూసుకుంది. 

ప్రాక్టికల్‌గా వర్కవుట్ అవ్వదు..

మహాదేవ్ ఇచ్చిన AI కార్స్ ఐడియా అందరు జడ్జిలను ఇంప్రెస్ చేసింది. కానీ అందులో ఎవ్వరూ కూడా ఈ ఐడియాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. ఇండియాలో AI కార్స్‌ను తయారు చేయగలిగేంత హైడ్రోజన్ లేదని వారు ఫీల్ అయ్యారు. అందుకే మహాదేవ్‌ను ఏదైనా ఆటోమొబైల్ కంపెనీలో జాయిన్ అవ్వమని, తన టాలెంట్‌తో అక్కడ కొత్త కొత్త ప్రయోగాలు చేయమని సలహా ఇచ్చారు. అంతే కాకుండా తను అడిగిన రూ.2 కోట్లతో పని అవ్వదని తేల్చి చెప్పారు. ‘‘చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారు పెద్దగా ఆలోచించడం బాగుంది. ఇలాంటివి చూసినప్పుడు మనకు చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఇవి సరైన మార్గంలో లేకపోతే బాధగా అనిపిస్తుంది’’ అంటూ అనుపమ్ మిట్టల్ కామెంట్స్ చేశారు.

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget