News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Astrological prediction for September 28th, 2023

మేష రాశి
వైవాహిక జీవితం బావుంటుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది కానీ అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సహనం తగ్గుతుంది. పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. తోబుట్టువుల నుంచి మద్దతు పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 

వృషభ రాశి
మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. స్నేహితుని సహాయంతో వ్యాపారంలో లాభసాటి అవకాశాలున్నాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సోమరితనం తగ్గించుకోవాలి. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు పెరుగుతాయి. ఉద్యోగ మారే అవకాశం ఉంది.  ఒత్తిడికి దూరంగా ఉండండి.

మిధున రాశి
ఈ రోజు మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వాహన సుఖం పొందుతారు. పాత స్నేహితుడిని కలుస్తారు.  స్వీయ నియంత్రణలో ఉండండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు పెరగవచ్చు. ఉద్యోగులు పనిపట్ల ఉత్సాహంగా ఉంటారు. ఆదాయవనరులు పెరుగుతాయి. 

Also Read: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

కర్కాటక రాశి
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. పని ప్రదేశంలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఒక ప్రత్యేక పని కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. పిల్లల విషయంలో ఆందోళన ఉండవచ్చు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు.

సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు అధిష్ఠానం నుంచి మద్దతు లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోపం వస్తుంది కానీ వెంటనే కూల్ అవుతారు. తొందరగా అలసిపోతారు. ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలుంటాయి. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. 

కన్యా రాశి 
ఈ రాశివారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఉద్యోగులు పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగం మారేందుకు ఇదే సరైన సమయం.  ఆదాయం పెరుగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. అధికకోపం తగ్గించుకోవాలి. మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి 

Also Read: గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

తులా రాశి
మనసులో ఒడిదొడుకులు ఉండొచ్చు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు పొందుతారు. తొందరగా అలసిపోతారు. మితిమీరిన కోపం ఉంటుంది. అధికారులతో అనవసర భేదాభిప్రాయాలు రావొచ్చు. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

వృశ్చిక రాశి
ఈ రాశివారు కాస్త ఓపికగా వ్యవహరించాలి. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ శ్రమ ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మనసు కలత చెందుతూనే ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మాటలో కర్కశత్వం ప్రభావం ఉంటుంది. జీవిత భాగస్వామి  అనారోగ్య  సమస్యలతో బాధపడవచ్చు.

ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో మార్పు వచ్చే అవకాశాలు ఉంది.మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనసులో  ప్రతికూల ఆలోచనల ప్రభావం ఉండవచ్చు. ఓపిక లేనట్టు అనిపిస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబం నుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉంటుంది.

మకర రాశి
ఈ రాశివారు కాస్త ఓపిక పట్టండి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో అదనపు బాధ్యతను పొందవచ్చు. అధికారులతో విభేదాలుంటాయి. ఉద్యోగ స్థలంలో మార్పు ఉండవచ్చు. కుటుంబంలో కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

కుంభ రాశి
ఈ రాశివారు సహనంగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు ఉండొచ్చు. శ్రమ పెరుగుతుంది. ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు వేసుకుంటారు. ధైర్యంగా ఉన్నట్టే ఉంటారు కానీ  ఏదో తెలియని భయంతో కలవరపడతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంభాషణలో సహనం పాటించండి. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది.

మీన రాశి 
ఈ రాశివారికి ఈ రోజు అనుకోని ఆదాయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. తొందరగా అలసిపోతారు. మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. 

 

Published at : 28 Sep 2023 05:34 AM (IST) Tags: daily horoscope Horoscope Today astrological prediction Today Horoscope Astrological prediction for September 21 28th September 2023 Horoscope

ఇవి కూడా చూడండి

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Christmas Santa Claus: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Vastu Tips In Telugu: ఇంటికి పేరు పెట్టేటప్పుడు ఈ సూచ‌న‌లు పాటించండి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు

Daily Horoscope Today Dec 8, 2023 : ఈ రాశివారు ఈ రోజు పరధ్యానంలో ఉంటారు, కుటుంబంలో వివాదాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే