News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Astrological prediction for September 27th, 2023

మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది..ఈ ప్రయాణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. బహుమతులు స్వీకరిస్తారు.  వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. ఉద్యోగులకు పనిపట్ల అంకితభావం పెరుగుతుంది. ఇంటా-బయటా గౌరవం పొందుతారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు.

వృషభ రాశి 
ఈ రాశివారు మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి ఇది సరైన సమయం. సృజనాత్మక పని విజయవంతమవుతుంది. ఉద్యోగులకు పని మీద ఏకాగ్రత ఉంటుంది. షేర్ మార్కెట్‌లో లాభాలు ఉంటాయి.  ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మిత్రులను కలుస్తారు. 

మిథున రాశి 
ఈ రాశివారు కాస్త ఓపికగా వ్యవహరించాలి. అనవసర ఖర్చు ఉంటుంది. చెడు సహవాసాన్ని నివారించండి. పనికిరాని వాటిపై దృష్టి పెట్టవద్దు. మీ పని పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అనవసర మాటలు నియంత్రించడం మంచిది. మీ మనసులో ఏదో ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. 

Also Read: మీ ఇంటి వాలు మీ ఆదాయ-వ్యయాలను నిర్ణయిస్తుందని మీకు తెలుసా!

కర్కాటక రాశి
ఈ రాశివారికి ఆత్మగౌరవం  పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది. ఓ పెద్ద పని చేయాలని భావిస్తారు. మీరు పురోగతి వార్తలను అందుకుంటారు. సంతోషం ఉంటుంది. ప్రారంభించిన పనులకు కుటుంబ సహకారం ఉంటుంది. ఏ వ్యక్తి మాటలకు ప్రభావితం కావద్దు. ఆర్థిక లాభాలు ఉంటాయి.

సింహ రాశి
ఈ రాశివారి చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఉద్యోగంలో ప్రశాంతతను అనుభవిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.  పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. శత్రువుల వల్ల హాని కలుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు, మార్గదర్శకత్వం పొందుతారు. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఆనందం ఉంటుంది.

కన్యా రాశి 
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రమాదాన్ని నివారించండి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు.  ఇంట్లో అశాంతి వాతావరణం ఉంటుంది. విద్యార్థులు లాభపడే అవకాశం ఉంది. వస్తు వనరుల సేకరణలో ధనాన్ని వెచ్చిస్తారు. రిస్క్ తీసుకోవద్దు. మీరు శ్రేయోభిలాషుల నుంచి సహాయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.

తులా రాశి 
ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఉంటాయి. ఏదో ఆందోళన వెంటాడుతుంది. మీ జీవిత భాగస్వామితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు తగ్గించడం మంచిది. ఎవరితోనైనా విభేదాలు ఉండవచ్చు. పనికిరాని వాటిపై దృష్టి పెట్టవద్దు. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ఏ పనిలోనూ తొందరపడకండి.

వృశ్చిక రాశి 
ఈ రాశివారికి చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగి లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది.ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది.  ఉద్యోగులకు శుభసమయం. 

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

ధనుస్సు రాశి 
ఈ రాశివారి పనితీరులో మెరుగుదల ఉంటుంది. సామాజిక కార్యాలు విజయవంతమవుతాయి. గౌరవం పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. లాభదాయక అవకాశాలు వస్తాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. 

మకర రాశి 
ఈ రాశివారికి రహస్య విషయాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు మంచి రోజు. వాహనం జాగ్రత్తగా నడపాలి..ప్రమాద సూచనలున్నాయి. తొందరగా అలసిపోతారు. మనసులో సంఘర్షణను తొలగించడం మంచిది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. సోమరితనం వీడండి.

కుంభ రాశి 
కెరీర్ సంబంధిత సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. సమయానికి భాగస్వాముల నుంచి మద్దతు పొందుతారు. ఏదో టెన్షన్ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

మీన రాశి 
ఈ రాశివారు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయొచ్చు. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కోర్టు  న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకావచ్చు. వాదించకు. వ్యాపారం బాగా సాగుతుంది. ఇంట్లో మరియు బయట ఆనందం ఉంటుంది.

Published at : 27 Sep 2023 04:36 AM (IST) Tags: Astrology daily horoscope Horoscope Today Today Horoscope 26th September 2023 Horoscope

ఇవి కూడా చూడండి

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో  ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Horoscope Today  December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
×