ఈ రాశులవారు కోపం, ఖర్చులు రెండూ తగ్గించుకోవాలి - అక్టోబరు 20 రాశిఫలాలు
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today October 20th, 2023
మేష రాశి
ఈ రాశివారికి చదువుపై ఆశక్తి పెరుగుతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఏదో విషయంలో ఆందోళన ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. కోపం తగ్గించుకోవాలి. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే అడుగు ముందుకు పడుతుంది.
వృషభ రాశి
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది కానీ ఆత్మవిశ్వాసం లోపించవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. స్నేహితుడి నుంచి వ్యాపార ప్రతిపాదనను పొందవచ్చు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదనపు ఖర్చులు తగ్గించుకోవాలి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.
మిథున రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది కానీ అంతకుమించిన బద్ధకం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రచన మరియు మేధోపరమైన పనిలో బిజీ పెరుగుతుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఆదాయం తగ్గిఖర్చులు పెరుగుతాయి.
కర్కాటక రాశి
ఈ రాశివారు అనవసర కోపాన్ని తగ్గించుకోవాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు పొందుతారు. శ్రమ పెరుగుతుంది కానీ మీకు అది కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
సింహ రాశి
ఈ రాశివారి మనసులో నిరాశ, నిస్పృహ భావాలు ఉండవచ్చు. సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. మితిమీరిన కోపం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు.
కన్యా రాశి
ఈ రాశివారు కాస్త ఓపికగా వ్యవహరించాలి. అధిక కోపాన్ని తగ్గించుకోవాలి. వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ తండ్రి నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. శ్రమకు మించిన ఫలితం ఉంటుంది. నూతన ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. విద్యార్థులు పరిశోధనకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు.
తులా రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మేధోపరమైన పని ద్వారా ఆదాయం పెరుగుతుంది. పని ప్రదేశంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. వాక్కు ప్రభావం వల్ల పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో పరస్పర వివాదాలను నివారించడానికి ప్రయత్నించండి. తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. మీరు మీ తండ్రి మద్దతు పొందుతారు. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల మనసు ఆందోళన చెందుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు రోజంతా ఆనందంగా ఉంటారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. రాజకీయ నాయకుల నుంచి మీకు అవసరమైన సహాయం అందుతుంది. సంభాషణలో సమతుల్యత ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తారు. ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. రాజకీయ ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారం విస్తరించవచ్చు. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారి మాటలో సౌమ్యత ఉంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు. విద్యార్థులు ఇతర విషయాలపై కాకుండా చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారం బాగా సాగుతుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి వ్యాపారంలో ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. సోదరులతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది
మకర రాశి
ఈ రాశివారు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి . ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సంభాషణలో ఓపికగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు.
కుంభ రాశి
ఈ రాశివారు కోపం తగ్గించుకోవాలి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. వ్యాపారంపై దృష్టి సారించాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు.
మీన రాశి
ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మనసులో హెచ్చు తగ్గులుంటాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలున్నా బాగానే సాగుతుంది.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.