Image Credit: Pixabay
Astrology : ఇందులో ఉండే మొత్తం ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. ఎందుకంటే ఒక్కో రాశిలో మూడు నక్షత్రాలు, మొత్తం 9 పాదాలుంటాయి. మీ జన్మ నక్షత్రం, పాదం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. ఇవి కేవలం మీ రాశి ఆధారంగా చెప్పే లక్షణాలు మాత్రమే.
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ రాశిలో జన్మించిన వారిది దూకుడు స్వభావం. ఏ విషయంలో అయినా ధైర్యం, శక్తి, కలహశక్తి, ఆలోచన లేకుండా అడుగుముందుకేయడం ఉంటుంది. వీరిలో మంచి లక్షణాలేంటంటే..సూక్ష్మగ్రాహులు, బాగా సంపాదిస్తారు, ఉపకారం చేసే బుద్ధి కలిగి ఉంటార. పట్టుదలతో ఎంతటి కార్యాన్ని అయినా సాధిస్తారు. అనారోగ్యాన్ని అస్సలు లెక్కచేయరు.
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఈ రాశిలో జన్మించినవారు స్థిరత్వం కలిగి ఉంటారు. ఎత్తైన భుజాలు, పెరిగిన కండలు, పెద్ద కళ్లు, విశాలమైన ముఖం కలిగిఉంటారు. గొడ్డు చాకిరీ చేస్తారు. ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఇతరుల ఆధీనంలో ఉంటారు. ఇతరులకు బాగా సహాయపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ నిర్వహణలో నేర్పులు. పనులు వాయిదా వేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు.
Also Read: ఈ ఆలయ నిర్మాణానికి 39 ఏళ్లు పట్టింది, దీని ప్రత్యేకత ఏంటంటే!
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మిథున రాశిలో పురుషుడు ఒక చేత్తో గద, స్త్రీ ఒక చేత్తో వీణ ధరించిన స్వరూపం. భార్యాభర్తలు ఇద్దరు యుక్తాయుక్త జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మానవతా దృక్పధంతో ఉంటారు. ఒకరి కోసం ఒకరు అనే భావనలో ఉంటారు.ఈ రాశివారు కొంతకాలం ఆర్ధిక ప్రతికూలత, కొంతకాలం ఆర్ధిక అనుకూలత.. రెండు వృత్తుల ద్వారా ఆదాయం కలిగి ఉంటారు. ఎక్కువ కోరికలు కలవారు, విలాస వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసేవారు అవుతారు. ఎవరినైనా తొందరగా నమ్ముతారు..ఒక్కోసారి మోసపోతారు..
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో జన్మించినవారు ఆలోచనాపరులు. కార్యనిర్వహణలో సమర్థత కలిగి ఉంటారు. ఆశలు అధికంగా ఉంటాయి. అనుకున్న పనుల విషయంలో పట్టువదలకుండా ప్రయత్నిస్తారు. ఏదైనా సాధించే తెలివితేటలు వీరిసొంతం. స్వతంత్ర్య భావాలు కలిగి ఉంటారు. వీరికి అవసరం అయితే అపకారం చేయడానికి కూడా వెనుకాడరు. జీవితంలో కొన్ని ఆటుపోటులు ఎదుర్కొంటారు. చంద్రుడి కళలా వీరి జీవితంలో కొన్ని రోజులు వెలుగు, కొన్ని రోజులు ఆ వెలుగు తగ్గుతుంది. మళ్లీ పుంజుకుంటారు.
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఈ రాశి వారు పేరుకి తగ్గట్టే మృగ స్వభావం. గట్టిగా అరవడం, ఎదుటివారిని భయం కలిగించడం, వీరుమాత్రం స్వేచ్ఛగా సంచరించడం, ఎలాంటి జంకు బొంకు లేకుండా ఉండడం వీరి లక్షణాలు. అందరినీ మించిపోవాలనే స్వభావం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మంచి విద్యాబుద్దులు కలిగి ఉంటారు. ఉన్నత స్థానంలో ఉంటారు. వృత్తి ఉద్యోగములలో రాణిస్తారు.
Also Read: విష్ణుసహస్రం పారాయణం చేయాల్సిన సందర్భాలివే!
కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
ముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం, ఒక చేత్తో సస్యము ధరించిన స్త్రీ ఈ రాశి సింబల్. కన్య అంటే పుష్పవతి కాని స్త్రీ అని అర్థం. విశేషమైన ఊహాలు, సిగ్గు, బిడియం, దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు భయం ఉంటుంది. అమాయక ప్రవర్తన కలిగి ఉంటారు. పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు. స్త్రీకి ఉండే వాత్సల్యం, అభిమానం, బంధు ప్రేమ ఈ రాశివారి సొంతం. తన బాధను, శ్రమను ఇతరులు గుర్తించాలనే భావం కలిగి ఉంటారు. లేమిలోపుట్టి లేమిలోనే అంతరిస్తారు ఈ మధ్యలో మాత్రం సఖవంతమైన జీవితం గడుపుతారు.
Christmas Celebrations 2023: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!
Daily Horoscope Today Dec 05, 2023 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగంలో ఏ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది - డిసెంబరు 05 రాశిఫలాలు
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!
Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
/body>