అన్వేషించండి

Pawan Meet Chandrababu: చంద్రబాబు, పవన్ సుదీర్ఘ సమావేశం - చర్చించిన అంశాలు ఇవేనా ?

Pawan Kalyan: పవన్ కల్యాణ్ .. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. పలు రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

What did Pawan and Chandrababu discuss in the meeting:    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ ఏకాంత సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు,  కూటమి పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఉండాల్సిన సమన్వయంపై ఇరువురు నేతలు  చర్చించినట్లుగా తెలుస్తోంది. 

సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్  విచారణ పురోగతి, దోషులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై నేతలిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది.  భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, క్షేత్రస్థాయిలో భక్తులకు వాస్తవాలు వివరించేలా ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే, విపక్షాలు కుల రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, అటువంటి ట్రాప్‌ లో పడకుండా కూటమి నేతలు అప్రమత్తంగా ఉండాలని బాబు-పవన్ ఓ నిర్ణయానికి వచ్చారు. 

రానున్న  రాజ్యసభ ఎన్నికల అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.  ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీపై ప్రాథమికంగా చర్చలు జరిగాయి. కూటమిలోని మూడు పార్టీల బలాబలాల ప్రకారం సీట్ల కేటాయింపు ఎలా ఉండాలనే దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యంగా జనసేన , బీజేపీలకు ఇచ్చే ప్రాధాన్యతపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి, కార్యకర్తలకు న్యాయం చేయాలని నేతలు నిర్ణయించారు.              

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ తరపున రెండు రోజుల ప్రచారానికి  పవన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రస్తావించాల్సిన అంశాలపైనా పవన్ కల్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజకీయపరంగా సున్నితమైన వ్యవహారం కావడం.. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో చంద్రబాబు నుంచి కొన్ని సూచనలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఈ సమావేశం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, అత్యంత సమన్వయంతో ముందుకు వెళ్తున్నామనే సంకేతాన్ని పంపింది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పదవులు, రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget