Andhra Pradesh: టీడీపీలోకి విజయసాయి? మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ
Vijayasai Reddy: పార్టీ మారేది లేదని చెబుతూనే.. మంత్రి అచ్చెన్నాయుడిపై వెటకారంగా ట్వీట్ వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ లాంటి కుల పార్టీలో తాను చేరనని చెప్పారు.
Atchannaidu Vs Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అనే నేను టీడీపీ(TDP) అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా..? అచ్చెన్నా...! నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా..! అంటూ ట్వీట్ వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాను పార్టీ మారతానంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. గతంలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామా సమయంలో కూడా విజయసాయిరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాజాగా అచ్చెన్నాయుడు(Atchannaidu) వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి హైలైట్ అయింది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా టీడీపీలోకి వస్తామంటూ రాయబారాలు పంపిస్తున్నారని అచ్చెన్న కామెంట్ చేశారు. దీంతో మరోసారి విజయసాయి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈసారి మరింత ఘాటుగా ఆయన రియాక్ట్ అయ్యారు.
విజయసాయి ఏమన్నారంటే..?
తాను పార్టీ మారేది లేదని చెబుతూనే.. మంత్రి అచ్చెన్నాయుడిపై సెటైర్లతో ట్వీట్ వేశారు విజయసాయిరెడ్డి. దేవుడు అచ్చెన్నాయుడిని పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1 శాతం మాత్రమే ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. చిన్నప్పుడు అచ్చెన్నాయుడు ఫ్రెండ్స్ ఆయన్ను అచ్చి.. బుచ్చి... కచ్చి... అని ఆట పట్టించేవారని కూడా చెప్పారు. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల ఆయన చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు విజయసాయి. ఆయన మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటారని.. తన విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై అందుకే జోకులు పేలుస్తున్నారని చెప్పారు. టీడీపీ అనే కులపార్టీలో చేరేందుకు తానెప్పుడూ ప్రయత్నించలేదన్నారు. "అడ్డం, నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా" అంటూ.. అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ వేశారు విజయసాయి రెడ్డి.
అచ్చంనాయుడూ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 26, 2024
దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి... కచ్చి... అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు… pic.twitter.com/G0UoqnGsQJ
ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎవరు ఏవైపు ఉంటారనే విషయం తేలడంలేదు. జగన్ కి స్వయానా బంధువు, పార్టీ పెట్టినప్పటినుంచి జగన్ వెన్నంటే ఉన్న బాలినేని శ్రీనివాసులరెడ్డి సైతం పార్టీ మారారు. జగన్ తో పాటు అప్పట్లో కేసులు ఎదుర్కొని, పార్టీనే నమ్ముకుని ఉన్న మోపిదేవి సైతం దూరం జరిగారు. తనకు జగన్ గుర్తింపు ఇచ్చారని, బీసీ అయిన తనను రాజ్యసభకు పంపించారని చెప్పిన ఆర్.కృష్ణయ్య సైతం.. బీసీ సమస్యలకోసం అంటూ ఆ పదవికి రాజీనామా చేసి, వైసీపీకి దూరంగా వచ్చేశారు. ఇలాంటి టైమ్ లో విజయసాయిరెడ్డిపై పుకార్లు పెద్ద విశేషమేమీ కాదు. అయితే అచ్చెన్నాయుడు కూడా విజయసాయి ప్రయత్నించారని మాత్రమే చెప్పారు. ఆయన పార్టీ మారతారని ఎక్కడా స్టేట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఎంపీ విజయసాయికి కోపమొచ్చింది. తాను పార్టీ మారతాననడం పెద్ద జోక్ అంటూనే.. అచ్చెన్నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి వైసీపీలో గతంలో ఉన్నంత పలుకుబడి ఇప్పుడు విజయసాయిరెడ్డికి లేదు. ఆయన్ను నెల్లూరు లోక్ సభ స్థానానికి పంపించినప్పుడే.. ఉత్తరాంధ్ర రాజకీయాలపై పెత్తనాన్ని తీసేశారు. ఇటీవల నెల్లూరు జిల్లాకు కూడా ఇన్ చార్జ్ లను ప్రకటించారు. దీంట్లో విజయసాయి పేరు లేదు. అంటే ఇక నెల్లూరు రాజకీయాలకు కూడా విజయసాయి దూరం కావాల్సిందే. మరోసారి ఆయన నెల్లూరు వచ్చి నేను పోటీ చేస్తాను ఓట్లేయండి అని జనాలను అడిగే అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చే రూమర్లపై విజయసాయి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఒంగోలులో వద్దు, మంగళగిరికి ఒక్కరే రండి- బాలినేని జనసేన ఎంట్రీలో సూపర్ ట్విస్ట్