AP News Developments Today: ఆనం కుటుంబంలో వార్: సీఎం జగన్‌తో ఆనం విజయ్ భేటీ, నెల్లూరు రాజకీయాల్లో మలుపు
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది.. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.. సోమవారం రోజున 56,003 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 20,365 మంది తలనీలాలు సమర్పించగా, 3.89 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. ఇందులో భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి రచించిన పాసురాళ్ళను జియ్యంగార్లు పఠించి స్వామి వారిని మేలు కొల్పారు.. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు.. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు..
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి.. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం.. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు.. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు.. ఈ కైంకర్యాల్లో భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు.. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..
వైజాగ్ లో విభజన హామీల కోసం యువజన సమర యాత్ర
జనవరి 20 నుంచి ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రత్యేక హోదా విభజన హామీల కోసం మొదలయ్యే విద్యార్థి యువజన సమర యాత్ర 2.0 విషయంపై ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి, విద్యార్థి- యువజన సంఘాల నేతలు ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆచార్య అప్పల నాయుడు, విద్యార్థి సంఘాల నేతలు హాజరవుతారు. మీడియా మిత్రులను హాజరై మన హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాటం కొనసాగుతుంది అని సమితి నాయకులు చెబుతున్నారు.
ఆనం కుటుంబంలో వార్: సీఎం జగన్‌తో ఆనం విజయ్ భేటీ, నెల్లూరు రాజకీయాల్లో మలుపు
నెల్లూరు రాజకీయాల్లో ఇదో కీలక మలుపు. ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ పక్కన పెట్టడంతో ఆయనతోపాటు కుటుంబం మొత్తం వైసీపీని వీడే అవకాశాలున్నాయని అనుకున్నారు. కానీ సడన్ గా ఆనం సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి అందరికీ షాకిచ్చారు. ఆయన నేరుగా సీఎం జగన్ ని వెళ్లి కలిశారు. తన భార్య, నెల్లూరు జడ్పీ చైర్మన్ అరుణమ్మ, కుమారుడు కార్తికేయ రెడ్డితో కలసి వెళ్లి జగన్ ని కలిశారు. తామంతా సీఎం జగన్ వెంటే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. అంటే ఒకవేళ రామనారాయణ రెడ్డి పార్టీ మారినా, తాము మాత్రం వైసీపీలోనే ఉంటామని వారు జగన్ కి నమ్మకంగా చెప్పారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 19న
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. వందే భారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడవనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారయ్యే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు గరిష్ఠంగా 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. మరోవైపు తన అభ్యర్థన మేరకు విశాఖకు వందే భారత్ ట్రైన్ కేటాయించినందుకు ఎంపీ జీవీయల్ నరసింహ రావు ప్రధానికి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.