అన్వేషించండి

Reliance in Kurnool: కర్నూలులో రిలయన్స్ భారీ పరిశ్రమ - రూ.1,622 కోట్లతో బేవరెజెస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి

Kurnoool : కర్నూలులో రిలయన్స్ భారీ బేవరెజెస్ యూనిట్ పెట్టేందుకు సిద్ధమయింది. అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Reliance is set to set up a huge beverages unit in Kurnool:  కర్నూలు వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రూ.1,622 కోట్లతో శీతలపానీయాల పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. పరిశ్రమ ఏర్పాటుతో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎస్ఐపీబీ సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.  ఓర్వకల్లు ఏపీఐఐసీ ల్యాండ్ లో పరిశ్రమ ఏర్పాటు చేస్తారు.  

ఎకరాకు రూ.30 లక్షల చొప్పున ప్లాంటుకు 80 ఎకరాలు కేటాయిస్తారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు అందిస్తారు. 2026 డిసెంబర్ లోగా ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్ సంస్థకు గడువు విధించారు.  తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీకి ఆదేశాలు జారీ అయ్యాయి.                          
 
ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ యూనిట్‌లో ప్యాకేజ్డ్ కార్బోనేటెడ్ శీతల పానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్) , ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటివి తయారు చేస్తారు.  ఈ యూనిట్‌లో బాట్లింగ్ లైన్, వేర్‌హౌసింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ సౌకర్యం,  అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఉంటాయి.

రిలయన్స్ 2022లో రూ. 22 కోట్లకు కాంపా కోలా బ్రాండ్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ బ్రాండ్ 1970, 1980లలో భారతదేశంలో ప్రముఖ శీతల పానీయ బ్రాండ్‌గా ఉండేది.  దీనిని "న్యూ ఇండియా" కోసం సమకాలీన రూపంలో తిరిగి ప్రవేశపెట్టాలని రిలయన్స్ నిర్ణయించుకుదంి.  కర్నూలు ప్లాంట్ రిలయన్స్   ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) విభాగంలో భాగంగా  ఏర్పాటు చేస్తున్నారు.  ఇది దేశీయ బ్రాండ్‌లను ప్రోత్సహించడం,  భారతీయ వినియోగదారులకు సరసమైన ధరలలో అధిక నాణ్యత ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.                                           
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన  రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఆధ్వర్యంలో శీతల పానీయాల (సాఫ్ట్ డ్రింక్స్) , ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.  కాంపా కోలా కాంపా లెమన్ , కాంపా ఆరెంజ్ , పవర్ అప్ ,  సుర్ వాటర్ వంటి ఉత్పత్తులు  ఉన్నాయి.  ఈ బ్రాండ్ "The Taste of India" నినాదంతో స్థానిక వినియోగదారులను ఆకర్షించేలా సిద్ధం చేశారు.  ఈ ఉత్పత్తులు కోకా-కోలా, పెప్సీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లతో పోటీపడేందుకు సిద్దం చేస్తున్నారు. ఈ ప్లాంట్ కర్నూలు జిల్లాలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు స్థానిక వ్యాపారులకు, సరఫరాదారులకు అవకాశాలను కల్పిస్తుంది.   

రిలయన్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఇతర పెట్టుబడులను కూడా ప్రకటించింది, ఇందులో రూ. 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) యూనిట్ల ఏర్పాటు ఉంది, దీనిలో మొదటి ప్లాంట్ ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ప్రారంభించారు.

 

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget