అన్వేషించండి

Weather Updates: మరో అల్పపీడనం ముప్పు, ఏపీలో ఎఫెక్ట్ ఇలా - తెలంగాణలో 2 రోజులు IMD ఎల్లో అలర్ట్

ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఆగస్టు 19 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని వెల్లడించింది.

Rains In Telangana: ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ముప్పు తొలగిపోయిందనుకుంటున్న సమయంలో భారత వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి ప్రకటన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఆగస్టు 19 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని వెల్లడించింది. ఉత్తర - దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణలో నేటి రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 

తెలంగాణలో తేలికపాటి జల్లులు
వాయుగుండం తీరాన్ని దాటడంతో మంగళవారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. దక్షిణ తెలంగాణకు వర్ష సూచన లేదు. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఆగస్టు 19 నుంచి 21 వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈ ప్రాంతాల్లో మంగళవారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది.  ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు పడతాయి. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
వాయుగుండం బలహీనపడి తీరాన్ని దాటడంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. 

హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News:తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు
Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?
Layoff Threat: 40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్-  మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
40 ఏళ్లు దాటినవాళ్లకు బిగ్ అలర్ట్- మీ ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు!
Tirumala Goshala : తిరుమల గోశాల ఎప్పుడు ప్రారంభించారు? ఆవులు ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి?
తిరుమల గోశాల ఎప్పుడు ప్రారంభించారు? ఆవులు ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి?
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు  ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం, ఇలా రిజిస్టర్ చేసుకోండి
DC vs RR Super Over: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
ఐపీఎల్‌ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయి? ఎక్కువ ఎవరు ఆడారు?
Murshidabad Violence: ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
ముర్షిదాబాద్‌లో ఏం జరుగుతోంది? వక్ఫ్ ఘర్షణలపై మమత రియాక్షన్ ఏంటీ?
Embed widget