Bigg Boss Aadi Reddy: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆది రెడ్డికి సొంతూరులో ఘన స్వాగతం
నాలుగో స్థానంలో నిలిచినా ఆదిరెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆదిరెడ్డికి నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. నెల్లూరు జిల్లానుంచి వెళ్లిన ఆదిరెడ్డి బిగ్ బాస్ లో చివరి వరకూ ఉన్నారు.
బిగ్ బాస్ 6 సీజన్ ముగిసింది. సెలబ్రిటీలంతా అదరగొట్టారు. అయితే చివరి వరకూ పోటీలో నిలిచిన కామన్ మ్యాన్ ఆదిరెడ్డి మాత్రం తన యాటిట్యూడ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. నాలుగో స్థానంలో నిలిచినా ఆదిరెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆదిరెడ్డికి నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. నెల్లూరు జిల్లా నుంచి వెళ్లిన ఆదిరెడ్డి బిగ్ బాస్ లో చివరి వరకూ ఉన్నారు. టాప్ 4 గా ఆయన ఎలిమినేట్ అయ్యారు.
కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇ
Nenu Chadivina School Lo Alaa... 🤩 pic.twitter.com/YALFwldYzh
— Adi Reddy (@adireddyfantasy) December 21, 2022
చ్చిన నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాసి ఆదిరెడ్డికి సొంతూరులో ఘన స్వాగతం లభించింది. ఆదిరెడ్డి సొంత ఊరికి వస్తున్నాడని తెలిసి గ్రామస్తులు స్థానిక పాఠశాలలో స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థినీ విద్యార్థులతో కలసి ఆదిరెడ్డి కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి, టాప్ 4 స్థానం వరకు వచ్చిన ఆది రెడ్డికి బిగ్ బాస్ తో మరింత క్రేజ్ పెరిగింది. రెమ్యునరేషన్ పరంగా కూడా ఆదిరెడ్డి టాప్ ప్లేస్ లో నిలిచారని తెలుస్తోంది.
బిగ్ బాస్ లో అందరూ సెలబ్రిటీలే, జనాలకు బాగా పరిచయం ఉన్నవారే. ఆదిరెడ్డి మాత్రం కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే యూట్యూబర్ గా ఫాలోయింగ్ ఉన్నా కూడా అతి కొద్దిమందికి మాత్రమే అతను తెలుసు. అందులోనూ గ్లామర్ ఫీల్డ్ తో అస్సలు టచ్ లేదు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెద్దగా ఉండదనుకున్నారు. కానీ ఆదిరెడ్డి చివరి వరకూ కంటెస్టెంట్ గా నిలిచి తన సత్తా చాటాడు.
ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లు నడిచింది. ఆరు సీజన్లలో ఎప్పుడూ ఎక్కడా కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్నవారు టాప్ ప్లేస్ వరకూ వెళ్లలేదు. తొలి వారాల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చారు. కానీ ఆదిరెడ్డి మాత్రం చివరి వరకూ పోటీలో నిలిచారు. ఓ దశలో విజేతగా కూడా ఆదిరెడ్డికి అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా ఆయన టాప్ 4 లో ఉన్నప్పుడు వెనుదిరిగారు. ఆది రెడ్డి తర్వాత మరో ముగ్గురు నెంబర్ 1 స్థానానికి పోటీ పడ్డారు. రేవంత్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు. శ్రీహాంత్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఇంజినీరింగ్ చదివి, గతంలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగం చేసిన ఆదిరెడ్డి, ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి యూట్యూబర్ గా మారారు. బిగ్ బాస్ రివ్యూవర్ గా కూడా ఆదిరెడ్డికి మంచి పేరుంది. ఆ పేరుతోనే ఆయన బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరకు సెలబ్రిటీలకు కూడా గట్టి పోటీ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత ఆదిరెడ్డి ప్రస్థానం ఎలా ఉంటుందో చూడాలి. ఆయన కెరీర్ ని మార్చేసుకుంటారా..? లేక సొంత ఊరిలోనే ఉండిపోతారా అనేది వేచి చూడాలి. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఆదిరెడ్డికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.