అన్వేషించండి

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఏపీ అధ్వాన్నంగా ఉంది - ఎంపీ జీవీఎల్‌

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అట్టడుగు స్థాయికి చేరుకుందని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. 

MP GVL Narasimha: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే ఆంధ్రప్రదేశ్ పని తీరు అధ్వాన్నంగా ఉందని ఎంపీ జీవీఎల్‌ నరసింహ తెలిపారు. భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు రూ. 11.59 లక్షల కోట్లు కాగా.. ఏపీ నుంచి కేవలం రూ.1290 కోట్లు మాత్రమే ఉండడమే అందుకు నిదర్శనం అన్నారు. 2021-22లో భారతదేశం నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల ఏ మేరకు ఉన్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానం తెలిపారు. ఇందులో ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగాల నుండి ఎగుమతులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) కింద నమోదైన యూనిట్లు రూ.6.29 లక్షల కోట్లు కాగా, సెజ్ కింద నమోదైన యూనిట్లు రూ.5.3 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్  పేర్కొన్నారు.

అత్యధిక సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కలిగిన రాష్ట్రాలు కర్ణాటక (3.96 లక్షల కోట్లు), మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (1.81 లక్షల కోట్లు) అని వివరించారు. దీనితో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతులు కేవలం రూ. 1256 కోట్లు, ఇది భారతదేశ ఎగుమతుల విలువలో కేవలం 0.1% శాతం మాత్రమేనని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు మరియు సాంకేతిక సంస్థలతో విశాఖపట్నం నగరం రూ.776 కోట్ల మేర ఐటీ/ఐటీల ఎగుమతులకు మాత్రమే దోహద పడిందన్నారు. 

"ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు సాఫ్ట్ వేర్ రంగాన్ని శాసిస్తున్నారన్నది వాస్తవం. అందునా ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్లినటువంటి సాఫ్ట్ వేర్ రంగ నిపుణులు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల్లో పని చేసి ఐటీ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నారు. దీనిపై నేను ఈరోజు పార్లమెంట్ ప్రశ్నం అడగడం జరిగింది. వచ్చిన సమాధానం చూస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో సాఫ్ట్ వేర్ రంగం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని తెలుస్తుంది. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఐటీ రంగాన్ని ఏమాత్రం అభివృద్ధి చెందకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు. ఐటీ రంగంలో విశిష్ట స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఆంధ్ర యువతకు మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఎవరిని అడిగినా మేము హైదరాబాద్ లో , బెంగళూరులో పని చేస్తున్నామని చెబుతున్నారే తప్ప విజయవాడలో, విశాఖలో చేస్తున్నామని మాత్రం ఏ ఒక్కరూ చెప్పడం లేదు. అందుకు కారణం వైసీపీ ప్రభుత్వ అలసత్వమే. ఇప్పటికైనా చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి" - జీవీఎల్ నరసింహరావు, ఎంపీ

అయితే దీనిపై ఎంపీ జీవీఎల్ నసరింహ రావు స్పందిస్తూ... వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందిని, దీని ఫలితంగా సాఫ్ట్‌వేర్ రంగం దయనీయంగా మారిందని తెలిపారు. అత్యంత విజయవంతమైన మరియు సమర్థవంతమైన ఐటీ మానవ వనరులను అందించడంలో దేశానికి మరియు ప్రపంచానికి అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం నుండి పూర్తిగా లేకపోవడం దిగ్భ్రాంతికరం అని అన్నారు. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని చురుగ్గా కోరుతూనే ఉంటానని, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మార్చగల సామర్థ్యం ఉన్న ఐటీ రంగాన్ని రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం విస్మరించడం మానుకోవాలని ఎంపీ జీవీఎల్ కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget