అన్వేషించండి

MP Byreddy Sabari: ఏపీ భవిష్యత్ లోకేష్- మొదటి స్పీచ్‌తో లోక్‌సభలో అదరగొట్టిన టీడీపీ ఎంపీ శబరి

Lok Sabha: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తన మొదటి స్పీచ్‌లోనే దుమ్మురేపారు. చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ చేసిన కామెంట్స్‌ను తన స్టైల్‌లో తిప్పికొట్టారు. రాష్ట్ర సమస్యలను చాలా సూటిగా స్పష్టంగా చెప్పేశారు.

Andhra Pradesh: మొదటి స్పీచ్‌లోనే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి టాక్‌ ఆఫ్‌ద లోక్‌సభ అయిపోయారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో హాట్ హాట్ చర్చలు నడిచాయి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం శబరికి టీడీపీ తరఫున వచ్చింది. ప్రతిపక్షం నినాదాల మధ్యే ఆమె స్పీచ్ కొనసాగించారు. 

మొదటిసారి మాట్లాడుతున్నామనే భావన లేకుండా చాలా నిర్భయంగా ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చారు. టీఎంసీ సభ్యులు చేసిన విమర్శలకు చాలా ఘాటుగా  స్పందించారు. అదే టైంలో రాష్ట్రంలో ఐదేళ్లు సాగిన పాలనలో తప్పులను పార్లమెంట్‌లో ఎత్తి చూపారు. 

మొదటి రోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించి బీజేపీని టార్గెట్‌ చేశారు. తర్వాత రోజు మాట్లాడి టీఎంసీ ఎంపీలు చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. రెండు ఊత కర్రలతో మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పార్లమెంట్‌లోకి ప్రధానిగా వచ్చారని ఎద్దేవా చేశారు. అ రెండు ఊతకర్రల్లో ఒకరు చంద్రబాబు అయితే మరొకరు నితీష్ కుమార్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్లపై ఉన్న కేసులను మోదీ పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. 

టీఎంసీ సభ్యులు చేసిన కేసుల ఆరోపణలపై స్పందించిన శభరి... అవి సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు కాదని కుట్రపూరితంగా అప్పటి ఏపీ ప్రభుత్వం సీఐడీతో పెట్టించిన కేసులను గుర్తు చేశారు. తన నియోజకవర్గంలోనే కుట్రపూరితంగా అప్పటి ప్రభుత్వం అరెస్టు చేయించిందని తెలిపారు. అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలను టీడీపీ గెలుచుకుందని అక్రమాలు చేస్తే ఈ విజయం సాధ్యమా అని ప్రశ్నించారు. సభను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేశారని అన్నారు.  

"ముఖ్యమంత్రి చంద్రబాబు పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన కామెంట్స్‌ను ఖండిస్తున్నాం. ఈడీ, సీబీఐ అరెస్టు చేసిందనే తప్పుడు ఆరోపణలు చేసి సభను తప్పుదారి పట్టిస్తున్నారు. నా నంద్యాల నియోజకవర్గంలోనే చంద్రబాబును అప్పటి ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. నంద్యాలలో ఎప్పటి నుంచో కాంగ్రెస్‌, వైసీపీ చాలా బలంగా ఉన్నాయి. అలాంటి చోట టీడీపీ ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఎలా గెలుచుకుందని అనుకుంటున్నారు? ఎంపీ స్థానంలో నేను భారీ మెజార్టీతో ఎలా గెలిచానో చెప్పగలరా? ఏపీలో 175 సీట్లకు 164, 25 పార్లమెంట్ స్థానాలకు 21 ఎంపీ సీట్లలో ఎలా విజయం సాధించామో వివరిస్తారా?    

మోదీని ఉద్దేశిస్తూ కల్యాణ్ బెనర్జీ చేసిన కామెంట్స్‌పై కూడా శబరి ఫైర్ అయ్యారు. మోదీ రెండు ఊతకర్రలతో ప్రధానిగా సభలోకి వచ్చారని ఎద్దేవా చేశారన్నారు. కానీ అవి ఊత కర్రలు కావని... కత్తులను గుర్తు చేశారు. " ఆయన(కల్యాణ్ బెనర్జీ) చాలా వ్యంగ్యంగా ప్రధానమంత్రి మోదీ రెండు ఊతకర్రలతో సభకు వచ్చారని అన్నారు. అందులో ఒకటి చంద్రబాబు నాయుడని చెప్పుకొచ్చారు. మీరు చాలా సీనియర్ లీడర్‌. మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. మీరున్నట్టు అది ఊతకర్ర కాదు... కత్తి."

వైసీపీ విధ్వంసంతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ, ఎన్డీఏకు పట్టం కట్టారని గుర్తు చేశారు శబరి. వారి ఆశలను నిలబెట్టేందుకు మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ శ్రమిస్తున్నారని అన్నారు. కచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నిలబెడతామన్నారు. చంద్రబాబు పనితీరు ఏంటో ఇప్పటికే ప్రపంచానికి తెలుసన్నారు. భారత దేశంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అందులో చంద్రబాబు ఒక ఆణిముత్యంలా ఉంటారని చెప్పారు. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ భాగస్వాములుగా ఉంటారని చెప్పారు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్‌ రాలేదని... ఇలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రానికి కేంద్రం తన వంతు సాయం చేయాలని అభ్యర్థించారు శబరి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget