అన్వేషించండి

PM Modi Tour: నేడు సత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటన, నాసిన్ కేంద్రంలో కొత్త భవనాలు ప్రారంభించనున్న మోడీ

PM Modi Tour: శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.  గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రంలో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రారంభించనున్నారు.

Prime Minister Modi Tour In Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District)లో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi)పర్యటించనున్నారు.  గోరంట్ల (Gorantla)మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రం ( National Academy of Customs, Indirect Taxes and Narcotics)లో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఆరు హెలిప్యాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఐదు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాసిన్ కేంద్రంలో ప్రధాని మోడీ గంటన్నర పాటు ఉండనున్నారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవుతారు. 

స్వాగతం పలకనున్న సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్

మోడీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకొని...అక్కడి నుంచి హెలికాప్టర్లో మొదట లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తోలుబొమ్మలాటలను ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించే అవకాశం ఉంది. లేపాక్షి నుంచి హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలుకుతారు. రోడ్డు మార్గాన పాలసముద్రంలోని నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ కేంద్రంలో భవనాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ట్రైనీ ఐఆర్ఎస్ లతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

ఫ్లోరా ఆఫ్‌ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరణ

పాలసముద్రంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్‌ స్మగ్లింగ్‌ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్‌ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ డిటెక్షన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఎక్స్‌–రే, బ్యాగేజ్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని సందర్శిస్తారు. అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడనున్నారు.  74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్‌ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఫ్లోరా ఆఫ్‌ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్‌ సర్టిఫికెట్‌ను అందిస్తారు. బహిరంగసభలో మాట్లాడిన తర్వాత ఢిల్లీకి వెళతారు.
 

దేశంలోనే అతిపెద్ద నాసిన్ కేంద్రం

2022లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినట్లే ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. 503 ఎకరాల విస్తీర్ణంలో...దాదాపు 15 వందల కోట్ల రూపాయలతో నాసిన్ కేంద్రంలో భవనాలు నిర్మించింది కేంద్రం. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ముస్సోరిలో శిక్షణ కేంద్రం ఉన్నట్లుగానే...ఐఆర్ఎస్ లకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నాసిన్ కేంద్రం ఉంది. రెండవ నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసింది. ఇండియాలోనే అతిపెద్ద నాసిన్ కేంద్రం ఇది. 

హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం 23 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. కానీ సత్య సాయి జిల్లాలో ఏర్పాటు చేసిన నాసిన్ కేంద్రం 503 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నాసిన్ కేంద్రంతో పాటు లేపాక్షి ఆలయాన్ని ప్రధాని భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Embed widget