అన్వేషించండి

Kothapalli Subbarayadu : జనసేనలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు - నర్సాపురం నుంచి పోటీ చేయడమే టార్గెట్ !

Andhra News : మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతానని ప్రకటించారు. ఆయన నర్సాపురం అసెంబ్లీ టిక్కెట్ ఆశించే అవకాశం ఉంది.

Kothapally Subbarayudu has announced that he will join the Jana Sena  :  జనసేనలో చేరుతానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్వప్రయోజనాల ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే, పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలు నచ్చడంతో జనసేన లో చేరుతానని చెప్పారు.  పవన్ కల్యాణ్ గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి యువతకు ఆరాధ్య నాయకుడని అన్నారు. ఆయన సొంత సొమ్ము వెచ్చించి కౌలు రైతులకుఆర్ధిక సహాయం అందిచరన్నారు.రాజధాని అమరావతి విషయంలో ఆయన పోరాటం ఎనలేనిదన్నారు. రైల్వే జోన్‌, ప్రత్యేక హౌదా కోసం నిర్మొహమాటంగా పోరాటం చేశారన్నారు.

టీడీపీ నుంచి  ప్రజారాజ్యం, వైసీపీ నుంచి  జనసేనలోకి కొత్తపల్లి             
 
1989, 94, 99, 2004లో టీడీపీ నుంచి, 2012లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి మంత్రిగానూ పనిచేశారు. అయితే 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు చేతిలో ఓడిపోయారు. 2014లో సుబ్బారాయుడు తిరిగి టీడీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసారు. ఆ తరువాత 2019లో వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా పార్టీ వీడారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో ఇప్పుడు తిరిగి జనసేనలో చేరాలని సుబ్బారాయుడు నిర్ణయించారు.

నర్సాపురం అసెంబ్లీ సీటు ఆశిస్తున్న సు బ్బారాయుడు                                

కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నుంచి సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పార్టీ నేత బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్దిగా ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నుంచి మాధవ నాయుడు, ఎన్నారై కొవ్వలి నాయుడు పోటీ కోసం రేసులో ఉన్నారు. ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుందని చెబుతున్నారు.ఇప్పుడు తాజాగా సుబ్బారాయుడు ఎంట్రీతో సీటు పైన చర్చ మొదలైంది. అదే విధంగా విశాఖ, తూర్పు గోదావరిలో పవన్ తమ పార్టీకి దక్కే సీట్లుగా చెప్పిన నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లు ఉన్నారు. తమ పార్టీ నాయకత్వంతో జనసేనకు కేటాయించే సీట్ల పైన స్పష్టత కోరుతున్నారు. 

కొత్తగా చేరే వారికి టిక్కెట్లు లేవంటున్న జనసేన వర్గాలు                                      

పార్టీ నుంచి అధికారికంగా నిర్ణయం వచ్చిన తరువాత తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా చేరే వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వదని జనసేన వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కొత్తపల్లి సుబ్బారాయుడు టిక్కెట్ షరతు పెట్టి పార్టీలో చేరితే పవన్ ఆహ్వానించరని అంటున్నారు. మొత్తంగా ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక మంది నేతలు కూటమి దగ్గరకు చేరుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Embed widget