News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Perni Nani: ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు - పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని

చంద్రబాబు అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోని పక్కన పడేసే వ్యక్తి అని పేర్ని నాని విమర్శించారు.

FOLLOW US: 
Share:

చెప్పాడంటే చేస్తాడంతే.. అనే నమ్మకం కలిగించటంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సెల్ఫీ దిగలేదని తెలగు దేశం కార్యకర్త నారా లోకేష్ పై కోడిగుడ్లు వేస్తే ప్రభుత్వానికేంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు.

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది..

సీపీఎస్ ఉద్యోగులు పదవి విరమణ చేస్తే పెన్షన్ కూడా గతంలో అందేదికాదని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని. ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇచ్చేవారు కాదన్నారు. అయితే సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ ని రద్దు చేశారన్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోని పక్కన పడేసే వ్యక్తి అని పేర్ని నాని విమర్శించారు. పీఆర్సీ వేయాలన్నా కూడా గతంలో రోడ్డెక్కి ఆందోళన చేసేవారని, కానీ ఎవరూ రోడ్డెక్కకుండా 12వ పీఆర్సీని జగన్ వేశారని నాని తెలిపారు.

కాలయాపనతో సరిపెట్టిన చంద్రబాబు

40 ఏళ్ల అనుభవం ఉందనే చంద్రబాబు కాలయాపన కోసం మంత్రి వర్గ ఉపసంఘం వేసేవారని, దీంతో పీఆర్సీ అటకెక్కేదని తెలిపారు. ఉపసంఘాల వలన ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అని నాని ప్రశ్నించారు. జగన్ మాత్రమే సమస్యలపై చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ మాత్రమే ఇలా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఏపీవీపి ఉద్యోగులకు మూడు నెలకొకసారి జీతం వచ్చేదని, బిల్లులు చేయించుకుని, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ వచ్చిన తరువాతనే జీతాలు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. రిటైర్డ్ అయిన వారి కష్టాలు  అన్ని ఇన్నీ కాదని చెప్పారు. సుమారు 13 వేల మంది ఉద్యోగులకు ఇక పై  నెలనెలా జీతం వచ్చేలా జగన్ నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ఉద్యోగుల పట్ల సీఎం జగన్ ఎంత సానుకూలంగా ఉంటారో ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్నారు. చెవితో విని మనసుతో నిర్ణయాలు తీసుకుంటారని ప్రశంసించారు.

ప్రభుత్వ సర్వీసులోకి వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులు..

ప్రభుత్వ వైద్యవిధాన పరిషత్‌లో వైద్యులు కాకుండా నర్సులు, ఇతరత్రా ఉద్యోగులకు నెలనెలా జీతాలు కోసం అవస్థలు పడ్డారని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. మండలాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లును జిల్లా కేంద్రాల్లో సంతకాలు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని చెప్పారు. అయితే ఇప్పుడు అలాంటి జాప్యమేమీ లేకుండా దాదాపు 13వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపి, వారికి నెలనెలా జీతం అందించే ప్రక్రియకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.

ఆ పని చేసింది టీడీపీ వాళ్ళే...
తెలుగు దేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్దాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ ఎమ్మెల్యే కాదు, పార్టీకి అధ్యక్షుడు కూడా కాదన్నారు.ఆయనకు భద్రత కరువై పోయిందని గవర్నర్ ని కలవటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెచ్చుకున్న జనాన్ని చూసుకుని పోలీసులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.అచ్చెన్నాయుడు కూడా పోలీసులను బండబూతులు తిడుతున్నారని, సొంత పార్టీ వాళ్లే సెల్ఫీ తీసుకోనివ్వలేదని కోడిగుడ్డు వేస్తే ప్రభుత్వం రక్షణ కల్పించలేదనటం హస్యాస్పదంగా ఉందన్నారు. ముందు వాళ్ల కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలని సూచించారు.పోలీసులు మంచోళ్లు కాబట్టి ఎన్ని తిట్లు తిట్టినా లోకేష్ కు భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. వర్ల రామయ్య ఏ పదవి చేశాడని ఆయన సలహాలు ఇస్తున్నారో చెప్పాలన్నారు. టీడీపీలో పొలిట్ బ్యూరో అంటే తోతాపురి కంపెనీ లాంటిదని, చంద్రబాబుకు వర్ల రామయ్య సలహాలు ఇస్తే మంచిదని హితవు పలికారు. రాజకీయ నాయకుడు అంటే కులనేతలుగా చంద్రబాబు మార్చేశారని ఆరోపించారు.

Published at : 09 Jun 2023 07:17 PM (IST) Tags: AP Latest news Telugu News Today CM Jagan Perni Nani AP CM News ex minister perni nani

ఇవి కూడా చూడండి

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Minister RK Roja: పెద్ద దొంగ కోసం చిన్న దొంగ ఢిల్లీ పర్యటన- చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Minister RK Roja: పెద్ద దొంగ కోసం చిన్న దొంగ ఢిల్లీ పర్యటన- చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం

Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత