News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

సీపీఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌భుత్వం జీపీఎస్ అంశాన్ని తెర మీద‌కు తెచ్చింది. అయితే ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

CPS Cancellation Demand by AP Government Employees: ఏపీలో సీపీఎస్ ర‌ద్దు అంశం నివురు గ‌ప్పిన నిప్పులా ఉంది. మెన్నా మ‌ధ్య ప్రభుత్వ ఉద్యోగులంతా రోడ్కెక్కి ఆందోళ‌న చేయ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం దిగి రాక త‌ప్ప‌లేదు. దీంతో ఈ వ్య‌వ‌హ‌రం పై ఉద్యోగ సంఘాలతో జ‌రిపిన చ‌ర్చ‌లు తాత్కాలికంగా ఫ‌లించిన‌ప్ప‌టికి... దీర్ఘకాలికంగా  సీపీఎస్ ర‌ద్దు వ్య‌వ‌హ‌రం ఉత్కంఠ‌కు దారితీస్తోంది. సీపీఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌భుత్వం జీపీఎస్ అంశాన్ని తెర మీద‌కు తెచ్చింది. అయితే ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ ను ర‌ద్దు చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో సీపీఎస్ రద్దు అంశం మళ్లీ హీటెక్కిస్తోంది. 

సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల్లోనూ విభేదాలు.. 
ఇప్ప‌టికే సీపీఎస్ రద్దు అంశంపై ఉద్యోగ సంఘాల్లో కూడ విభేదాలు వ‌చ్చాయి. అన్ని ఉద్యోగ సంఘాలు క‌ల‌సి స‌మ్మెకు వెళ్లే స‌మ‌యంలో స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌భుత్వంతో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో లాలూచీ ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలు అన్ని క‌ల‌సి మ‌రో ఉద్య‌మానికి తెర తీశారు. సీపీఎస్ ర‌ద్దు అనే ప్ర‌ధాన అజెండా పైనే వీరి ఉద్య‌మం కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో మూడు ఏళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఈ వ్య‌వ‌హ‌రం క‌త్తిమీద సాములా మారింది. 

జగన్ సర్కార్‌కు ముడేళ్లు, సీపీఎస్ రద్దు చేస్తారా ? 
రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన ప్ర‌భుత్వ కమిటి ఉద్యోగుల‌తో ఇదివరకే స‌మావేశం అయింది. జీపీఎస్ అంశం తెర మీద‌కు తెచ్చారు. ఈ అంశంపై చ‌ర్చించేందుకు మ‌రో సారి ఈ నెల 25 స‌మావేశానికి హ‌జ‌రు కావాల‌ని ఉద్యోగ సంఘాల‌కు పిలుపు వ‌చ్చింది. సీపీఎస్ రద్దు, జీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలకు ప్ర‌భుత్వ క‌మిటి నుంచి ఆహ్వ‌నం అందింది. మే 25న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. మ‌రి ఈ స‌మావేశం త‌రువాత అయినా పూర్తి స్దాయి క్లారిటి వ‌స్తుందా లేక‌, మ‌రో సారి స‌మావేశం పేరుతో కాల‌యాప‌న జ‌రుగుతుందా అనేది తెలియాలంటే బుధవారం సాయంత్రం రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంది. మరోవైపు సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఉండటంతో సీపీఎస్ రద్దు, జీపీఎస్ పై నిర్ణయం వెనక్కి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే 

Also Read: KTR Jagan Meet: దావోస్‌లో అరుదైన కలయిక, ఒకే ఫ్రేములో డైనమిక్ లీడర్స్ - ‘అక్కడా ఏపీ పరువు తీస్తున్నారా’ అని నెటిజన్ల ఫైర్!

Published at : 24 May 2022 07:37 AM (IST) Tags: YS Jagan CPS AP Govt employees Contributory Pension Scheme GPS

ఇవి కూడా చూడండి

Garuda Seva In Tirumala: గరుడాద్రి వాసా, శ్రీ శ్రీనివాసా పాహిమాం - అంగరంగ వైభవంగా శ్రీవారికి గరుడ సేవ

Garuda Seva In Tirumala: గరుడాద్రి వాసా, శ్రీ శ్రీనివాసా పాహిమాం - అంగరంగ వైభవంగా శ్రీవారికి గరుడ సేవ

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Skill Development Case: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్న టీడీపీ, జైల్లో చంద్రబాబుతో చర్చలు

Skill Development Case: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్న టీడీపీ,  జైల్లో చంద్రబాబుతో చర్చలు

Nagababu Meeting: టీడీపీతో పొత్తు తర్వాత రంగంలోకి నాగబాబు, ఆ జిల్లాపై కన్నేసిన జనసేన

Nagababu Meeting: టీడీపీతో పొత్తు తర్వాత రంగంలోకి నాగబాబు, ఆ జిల్లాపై కన్నేసిన జనసేన

Sidharth Luthra : సిద్ధార్థ లూధ్రా మరో ఆసక్తికర ట్వీట్ - ఈ సారి ఏం చెప్పారంటే ?

Sidharth Luthra  : సిద్ధార్థ లూధ్రా మరో ఆసక్తికర ట్వీట్ - ఈ సారి ఏం చెప్పారంటే ?

టాప్ స్టోరీస్

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో