Breaking News Live: స్టీల్ ప్లాంట్ కోకోవెన్ లో అగ్ని ప్రమాదం..
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీజే
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శించుకున్నారు..ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..
శ్రీవారి సేవలో హీరో చిత్ర టీమ్
తిరుమల శ్రీవారి సన్నిధిలో "హీరో'' మూవీ చిత్ర యూనిట్ సందడి చేసింది.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో అశోక్ గల్లా,నిధి అగర్వల్, డైరెక్టర్ శ్రీరామ్ ఆధిత్య, ఘట్టమనేని పద్మావతి,పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ లు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల అశోక్ గల్లా మాట్లాడుతూ.. "హీరో" చిత్రం మంచి సక్సస్ సాధించాలని స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చాంమన్నారు.. అనంతరం హీరో చిత్రం ప్రొడ్యూసర్ గల్లా పద్మావతి మాట్లాడుతూ.. ఎక్కడున్నా మా అన్నయ్య రమేష్ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని స్వామిని ప్రార్ధించానని, మా అబ్బాయి హీరో సినిమా ద్వారా హీరోగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. యూత్, ఫ్యామిలీని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని,పొంగల్ కు ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.. అనంతరం పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. మా పెద్దబ్బాయి అశోక్ హీరోగా నటించిన చిత్రం మంచి విజయం సాధించాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని, కరోనా త్వరగా అంతంమై అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.
వాతావరణం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.
ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చిరు జల్లులు కురవనున్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని చోట్ల మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జనవరి 14 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
స్టీల్ ప్లాంట్ కోకోవెన్ లో అగ్ని ప్రమాదం..
విశాఖ స్టీల్ ప్లాంట్ కోకోవెన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. కన్వేయర్ బెల్ట్ దగ్ధమై ఈ ఘటన జరిగింది. ఇద్దరు కాంట్రాక్టు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాజువాక పెదగంట్యాడకు చెందిన కోన చిన్నారావుకు చేయి కాలిపోవటంతో స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సీపీపీ(కోల్ ప్రిపరేషన్ ప్లాంట్) నుంచి బ్యాటరీ ఫైవ్ కు కోల్ తరలిస్తుండా బెల్ట్ దగ్ధం కావటంతో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది.
జీతాల కోసం కేంద్రంలో బీజేపీ వద్ద మోకరిల్లుతున్న ఏపీ ప్రభుత్వం.. టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి
రాష్ట్రంలో ఉద్యోగస్తులను నమ్మించి గొంతు కోసిన ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కేంద్రంలోని బీజేపీ వద్ద మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సచివాలయ ఉద్యోగస్తులు ప్రొబేషన్ కాలం పూర్తయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సీఎం జగన్ యూ టర్న్ సీఎంగా పేరు తెచ్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో శంకుస్థాపనలకు పరిమితం అయ్యారన్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వానలోనే బాధితులను పరామర్శించానికి వెళ్తుండగా నల్లబెల్లి మండలం రేలకుంట దగ్గర ఎమ్మెల్యే కారు ముందు భారీ వృక్షం పడింది. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు, స్థానికులు వృక్షాన్ని తొలగించి రోడ్‌ను క్లియర్ చేశారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి కుటుంబంలో విషాదం
ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్‌మోహనరెడ్డి కుటుంబసభ్యులు ఇద్దరు గల్లంతయ్యారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. దుస్తుల కొనుగోలుకు మదన్‌మోహనరెడ్డి.. భార్య, కుమార్తెతో కలిసి ఉదయం విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అడిగొప్పల దాటాక ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మదన్‌మోహనరెడ్డి అతి కష్టం మీద ఈదుకుంటూ బయటకు రాగలిగారు. నీటి ప్రవాహ ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ప్రమాదంలో మదన్‌మోహనరెడ్డి భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కారు కోసం.. రాత్రి 11 గంటల వరకు గాలించినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యల్ని పర్యవేక్షించారు. గజఈతగాళ్ళ ను రంగం లోకి దింపగా తెల్లవారు జామున కారను గుర్తించారు. కారు తో పాటు కారులో ఉన్న రెండు మృత దేహాలను వెలికితీశారు. ఇద్దరు మృతి తో పండగ రోజుల్లో విషాదం నెలకొంది.
హెలికాప్టర్ లో గుంటూరు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
గుంటూరు.. హెలికాప్టర్ లో గుంటూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు చేరుకున్నారు. మరికాసేపట్లో రోడ్డు మార్గం ద్వారా విద్యానగర్ లోని ఐటీసీ గ్రూప్ వెల్కం హోటల్ కు సీఎం చేరుకుంటారు.